ఆంధ్రప్రదేశ్‌

37మంది డీఎస్పీలకు పోస్టింగ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: నెలల తరబడి పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న డీఎస్పీలకు సమస్య నుంచి ఎట్టకేలకు విముక్తి లభించింది. వెయిటింగ్‌లో ఉన్న 37 మంది డీఎస్పీలకు ఒకేసారి పోస్టింగ్ ఇస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎం దేవప్రసాద్‌ను ఏసీబీ డీఎస్పీగా, కె కేశప్పను చిత్తూరు ఎస్సీ, ఎస్టీ సెల్-2కు నియమించారు. బి మల్లిఖార్జునను తిరుపతి ట్రాఫిక్‌కు, జె బాబుప్రసాద్‌ను చిత్తూరు దిశ పోలీసు స్టేషన్‌కు, బి శ్రీరాంబాబును సీఐడీకి, కె ప్రకాష్‌బాబును గుంటూరు అర్బన్ క్రైం, వైవీ నాయుడును విశాఖపట్నం మెరైన్‌కు, బి శ్రీనివాసరావును సీఐడీకి,
ఈ అశోక్‌కుమార్ గౌడ్‌ను గుంతకల్లు డీఎస్‌ఆర్‌పీకి, ఎం శ్రీనివాసరావును విజయనగరం డబ్ల్యుపీఎస్‌కు, ఎఎస్‌సీ బోస్‌ను విజయవాడ డీఎస్‌ఆర్‌పీకి, జె వెంకటనారాయణను విజయవాడ సిటీ ట్రాఫిక్-2, జి చెంచుబాబును కడప ఫ్యాక్షన్ జోన్‌కు నియమించారు. బి విజయభాస్కర్‌ను పీసీఎస్ అండ్ ఎస్, ఎన్ వెంకట రామాంజనేయులును సీఐడీ, ఆర్ రమణను కర్నూలు డీటీసీ, సీహెచ్ సురేష్‌ను ఎస్‌పీఎఫ్‌కు, ఐ రామకృష్ణను కడప డీటీసీ, బి శ్రీనివాసులును సీఐడీకి, జి పూర్ణచంద్రరావును రాజమండ్రి డీటీసీకి, యు నాగరాజును నెల్లూరు డబ్ల్యుపీఎస్‌కు, జె జోగేశ్వరరావును పశ్చిమ గోదావరి డీటీసీకి నియమించారు. ఎస్‌ఆర్ రాజశేఖరరాజును విజయవాడ సిటీ పీసీఆర్‌కు, ఎస్‌వీ గోపాలకృష్ణను నెల్లూరు డీటీసీకి, ఎఎస్ చక్రవర్తిని సీఐడీకి, ఎన్ విష్ణును ఏపీఎస్‌పీ 11వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్‌గా, ఎం సుధాకరరావును ఒంగోలు పీటీసీకి, ఎ అప్పలరాజును కడప ఎస్సీ, ఎస్టీ సెల్‌కు, బి నాగేశ్వరరావును సీఐడీకి, బీవీఎస్ నాగేశ్వరరావును రాజమండ్రి డీఎస్‌ఆర్‌పీకి, టి కనకరాజును విజయవాడ సిటీ టాస్క్ఫోర్స్‌కు, పత్రిని శ్రీనివాసరావును గుంటూరు అర్బన్ డీసీఆర్‌బీకి, జి రాజీవ్‌కుమార్‌ను కర్నూలు సీసీఎస్‌కు, డి శ్రావణ్‌కుమార్‌ను ఏపీఎస్‌పీ 14వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్‌గా, జి రామకృష్ణను ప్రకాశం డీటీసీకి, పి భాస్కరరావును విజయవాడ సిటీ సీసీఎస్-2కు, కె రమేష్‌బాబును కృష్ణా డీటీసీ డీఎస్పీగా పోస్టింగ్‌లు కల్పించారు.

*చిత్రం... డీజీపీ గౌతమ్ సవాంగ్