ఆంధ్రప్రదేశ్‌

వైకాపా తీరుతో రాష్ట్రానికి చెడ్డ పేరు: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: వైసీపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రానికి చెడ్డ పేరు రావడమే కాకుండా లక్షలాది యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతోందని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 11.8 శాతం మేర అత్యధిక పెట్టుబడులను ఆకర్షించి దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో నిలిపామని శనివారం ట్విట్టర్‌లో చంద్రబాబు తెలిపారు. ఇందుకు ఆర్‌బీఐ తాజా బులిటన్ వివరాలే నిదర్శనమన్నారు. అలాంటిది ప్రస్తుతం పీపీఏల రద్దు, వాటాల కోసం బెదిరింపులు, డీలర్‌షిప్‌ల కోసం వేధింపులు తట్టుకోలేక 9 నెలల్లోనే 1.80 లక్షల కోట్లు పెట్టుబడులు వెనక్కి పోవడం బాధాకరమన్నారు. ఇటీవల దావోస్‌లో కూడా పారిశ్రామిక వేత్తలు ప్రస్తుత రివర్స్ పాలనపై ఆందోళన వ్యక్తం చేసారన్నారు. ఇకనైనా ప్రభుత్వం రాష్ట్భ్రావృద్ధి, భవితరాల భవిష్యత్తుపై దృష్టి సారించాలన్నారు.