ఆంధ్రప్రదేశ్‌

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. దీనిని అధిగమించడానికి, విద్యుత్ ఉత్పత్తి, వినియోగానికి మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడానికి రాష్ట్రంలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు (డిస్కం)లు చేయని ప్రయత్నాలంటూ లేవు. ఒకవైపు విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోతోంది. మరోపక్క ఇంధనం పరిమితులకు మించి అనుమతుల్లేకుండానే అదనపు విద్యుత్ వాడకానికి అదుపులేకుండా పోతోంది. విద్యుత్ సరఫరాలో లీకేజీలు, వృధా, విద్యుత్ చౌర్యం వంటివి జరుగుతున్నాయి. ఈ పరిస్థితులన్నింటినీ అధిగమించి ఈ వేసవి సీజన్‌ను గట్టెక్కించేందుకు డిస్కంలు కసరత్తు ప్రారంభించాయి. అయితే దీనివల్ల ఏ విధమైన ఫలితాలు వస్తాయోనంటూ డిస్కం వర్గాలు అయోమయంలో పడుతున్నాయి. పరోపక్క సాంకేతిక పరమైన కారణాలతో విద్యుత్ ఉత్పత్తి, వినియోగానికి మధ్య 3,955 మిలియన్ యూనిట్ల వ్యత్యాసం ఉంటుందని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఇప్పటికే అంచనా వేశాయి. లోటు అధిగమించడానికి బహిరంగ మార్కెట్‌లో
విద్యుత్‌ను కొనాల్సిన అవసరాన్ని విద్యుత్ నియంత్రణ మండలికి 2020-21 ఆర్థిక వార్షిక నివేదిక (ఏఆర్‌ఎస్)లో పేర్కొంది కూడా. అయితే అందుబాటులో ఉన్న విద్యుత్‌ను తక్కువ చేసి చూపించడంతో కొత్త సమస్యల తలెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన ఎన్‌టీపీసీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి 1975 మెగావాట్లను తీసుకోవాలని ఏపీఈఆర్‌సీ గత ఏడాదిలోనే ఆదేశాలు జారీ చేసినా దీనిని చూపకపోవడంపట్ల సంస్థ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క జెన్కో యూనిట్లలో సామర్థ్యానికి తగినట్టు ఉత్పత్తి చూపకుండా తగ్గిస్తున్నారు. హిందుజా థర్మల్ పవర్, జీవీకే, జీఎంఆర్ వేమగిరి తదితర గ్యాస్ ఆధారిత విద్యుత్‌ను తగినరీతిలో చూపలేక పోతోంది. కనీసం సౌర, పవన విద్యుత్‌ను కూడా తక్కువుగానే చూపిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది. మరోవైపు డిమాండ్ మాత్రం ఎక్కువుగా పేర్కొనగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ అమ్మకాల కంటే వచ్చే ఏడాది 10.23 శాతం పెరుగుతుందని ఈపీడీసీఎల్, మరో5.53 శాతం పెరగవచ్చని ఎస్‌పీడీసీఎల్‌ఐ అంచనాలు చూపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో అన్ని రంగాల్లో ఉత్పత్తి క్షీణిస్తుండగా మరోపక్క దేశంలో విద్యుత్ వినియోగం తగ్గుతూ వస్తోందంటూ కేంద్ర ప్రభుత్వ గణాంకాల శాఖ స్పష్టం చేసింది.