ఆంధ్రప్రదేశ్‌

ఏపీ క్యాడర్‌కు ఇద్దరు ఐఏఎస్ అధికారుల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 28: అంతర్-క్యాడర్ బదిలీ కింద ఏపీ క్యాడర్‌కు ఇద్దరు ఐఏఎస్ అధికారులను కేంద్రం బదిలీ చేసింది. నాగాలాండ్ క్యాడర్‌కు చెందిన 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్‌ను, ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి థమీమ్ అన్సారియాను ఏపీ క్యాడర్‌కు వివాహ కారణాలతో బదిలీ చేసింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను మంగళవారం జారీ చేసింది. కాగా, ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు మాజీ సీఈవో జె.కృష్ణ కిషోర్‌ను బదిలీ చేస్తూ సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్టు చేయమన్న ఉత్తర్వు మేరకు గత ఏడాది జూలైలో రిపోర్టు చేశారు. అయితే కేంద్ర సర్వీసులకు చెందిన వారిని నియమించేందుకు నాన్-క్యాడర్ పోస్టులు ఖాళీ లేకపోవడంతో తాత్కాలికంగా స్పెషల్ సెక్రటరీ పోస్టు సృష్టించి అందులో నియమించారు. ఈ మేరకు సాధారణా పరిపాలనా విభాగం ఉత్తర్వు జారీ చేసింది.
15 రహస్య జీవోలు జారీ
మూడు శాఖలకు సంబంధించి 15 రహస్య జీవోలను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జారీ చేసింది. న్యాయ శాఖ 2 రహస్య జీవోలను, రెవెన్యూ శాఖ ఒక జీవోను, మిగిలిన 12 జీవోలను పురపాలక శాఖ జారీ చేసింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు, వికేంద్రీకరణ, ఏపీసీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపిన నేపథ్యంలో ఈ జీవోలు జారీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.