ఆంధ్రప్రదేశ్‌

మండలి రద్దుకు మంత్రివర్గం ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 27: రాష్ట్ర శాసనమండలిని రద్దుకు మంత్రిమండలి ఏకగ్రీవామోదం తెలిపింది. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలపై చర్చించారు. మండలి రద్దుకు నిర్దేశించిన ఈ సమావేశంలో మచిలీపట్నం పోర్టు, భోగాపురం విమానాశ్రయాలపై కొద్దిసేపు చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేసే అంశం ప్రస్తావనకు వచ్చింది. భోగాపురం విమానాశ్రయానికి భూ సేకరణ, కేంద్ర అనుమతులపై చర్చించారు. సీతానగరం కొండపై అభివృద్ధికి సంబంధించి 40 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని, కడపలో తెలుగుదేశం పార్టీకి లీజుకు ఇచ్చిన ఆర్ అండ్ బీ స్థలాన్ని వెనక్కు తీసుకునే అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

*చిత్రం... క్యాబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి

*