ఆంధ్రప్రదేశ్‌

మండలి రద్దు నిర్ణయం గర్హనీయం: సీపీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 27: శాసనసభ ఆమోదించిన బిల్లులను తిరస్కరిస్తున్నదనే సాకుతో శాసనమండలిని రద్దు చేయడం అప్రజాస్వామికమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు అన్నారు. రాష్ట్రాల్లో ఎగువ సభలు, గవర్నర్ పదవులకు సంబంధించి సీపీఎం మొదటి నుండి సూత్రబద్ధ వైఖరితోనే ఉందని అందులో మార్పులేదన్నారు. కానీ అధికారపక్షం తన బిల్లులను మండలి అడ్డుకుంటున్నదనే మిషతో శాసన మండలిని రద్దు చేయడం గర్హనీయమన్నారు.
మండలి రద్దు అప్రజాస్వామికం: సీపీఐ
ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానించడం అప్రజాస్వామికమని, ఇది సీఎం జగన్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ధ్వజమెత్తారు. విజయవాడ దాసరిభవన్‌లో సోమవారం ఆయన విలేఖర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగపరమైన మండలి రద్దుకు వైసీపీ ప్రభుత్వం కేబినెట్‌లోను, అసెంబ్లీలోను తీర్మానించి, రాష్ట్ర ప్రజలందరినీ అయోమయానికి గురి చేసిందని విమర్శించారు.