ఆంధ్రప్రదేశ్‌

ఎపి అసెంబ్లీలో మూడు బిల్లులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరఫున మంత్రి ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనుమతితో 2016 దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాయలం సవరణ బిల్లును, ఆంధ్రప్రదేశ్ విద్యుచ్ఛక్తి శాసనాల సవరణ బిల్లు 2016ను, 2016 ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాల సవరణ బిల్లును మంత్రి ప్రవేశపెట్టారు.
డిమాండ్లు ప్రతిపాదించిన మంత్రులు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.4728.94 కోట్లకు మించకుండా మంజూరు చేయాలని ఆ శాఖ మంత్రి నారాయణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.5753.89 కోట్లు మంజూరు చేయాలని ఆ శాఖ మంత్రి తరఫున గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.మృణాళిని, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.10,434.76 కోట్లు మంజూరు చేయాలని ఆ శాఖ మంత్రి మృణాళిని సభలో ప్రతిపాదించారు. రెవెన్యూ, రిజిష్ట్రేషన్, సహాయానికి రూ.2292.49 కోట్లు మంజూరు చేయాలని ఆ శాఖ మంత్రి తరఫున కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆబ్కారీ శాఖ నిర్వహణ కోసం రూ.378.30 కోట్లు మంజూరు చేయాలని వెనుకబడిన తరగతుల సంక్షేమం, సాధికారత, చేనేత, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శాసనసభలో ప్రతిపాదించారు. వాణిజ్య పన్నుల నిర్వహణ కింద రూ.383.92 కోట్లు మంజూరు చేయాలని వాణిజ్య పన్నులు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి తరఫున మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపాదించగా, రవాణా నిర్వహణ కింద రూ.150.77 కోట్లకు మించకుండా మంజూరు చేయాలని ఆ శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు ప్రతిపాదించారు. హోంశాఖ పాలన కింద రూ.4785.40 కోట్లకు మించకుండా మంజూరు చేయాలని హోంమంత్రి చినరాజప్ప సభలో ప్రతిపాదించారు.