ఆంధ్రప్రదేశ్‌

శాసనసభ సమావేశాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 27: శాసనసభ సమావేశాలు జరుగుతున్న తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, బిజినెస్ అడ్వయిజరి కమిటి (బీఏసీ)లో సమావేశాల పొడగింపుపై చర్చించకుండానే సమావేశాలు కొనసాగించటం దారుణమని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. సోమవారం మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీఎల్పీ సమావేశం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగింది. శాసనసభ సమావేశాల నిర్వహణ తీరు, మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టటం, శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల అసత్య ప్రచారం తదితర అంశాలపై దాదాపు 5 గంటల పాటు చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ శాసనసభ నిర్వహణలో బీఏసీ ఎజెండాను ఉల్లంఘించారన్నారన్నారు. ఈ విషయంపై గవర్నర్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు. బీఏసీకి చెప్పకుండానే సభను పొడగించారని, మండలిలో సెలెక్ట్ కమిటికి పంపిన బిల్లును అసెంబ్లీలో చర్చించడం నిబంధనలకు విరుద్ధమని, అంతేకాకుండా కౌన్సిల్‌లో మాట్లాడిన అంశాలను శాసనసభలో ప్రస్తావించడంపై కూడా లేఖలో పేర్కొన్నామన్నారు.