ఆంధ్రప్రదేశ్‌

మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా పట్టణాల అభివృద్ధి: మంత్రి బొత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 27: మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా పట్టణాల అభివృద్ధి చేపట్టాలని అధికారులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. నగరంలోని ఏపీసీఆర్‌డీఏ కార్యాలయంలో వివిధ పట్టణాభివృద్ధి సంస్థ (ఊడా)ల వైస్ చైర్మన్‌లు, కార్యదర్శులు, ఆయా సంస్థల టౌన్ ప్లానింగ్ అధికారులతో సోమవారం రాత్రి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణీకరణ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అభివృద్ధి ఒక క్రమ పద్ధతిలో ఉండాలన్నారు. ఊడాల పని తీరు సమర్థవంతంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ఉడాలకు వస్తున్న ఆదాయాన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. పట్టణాభివృద్ధి సంస్థలు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేసేందుకు అనువైన స్థితిలో ఉన్నాయో లేదో అధ్యయనం చేయాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రణాళికాయుతంగా జరిగేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఊడాల పనితీరు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడెక్కడ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి, రోడ్లు, గ్రీనరీ తదితర అంశాలపై ఆరా తీశారు. ఊడాలకు వస్తున్న ఆదాయం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల కేటాయింపు, లే అవుట్ల క్రమబద్ధీకరణ తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ కార్యదర్శి శ్యామలరావు, కమిషనర్ విజయకుమార్, డీటీసీపీ రాముడు, సీఆర్‌డీఏ కమిషనర్ లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు.