ఆంధ్రప్రదేశ్‌

రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రజల్లో గెలవలేని వారికి శాసన మండలి ఒక పునరావాస కేంద్రంగా మారిందని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. శాసనమండలి రద్దుపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 బిల్లులకు బ్రేక్ వేసే ప్రయత్నం జరిగిందన్నారు. ప్రజలు తిరస్కరించిన పార్టీ బిల్లులను దొడ్డిదారిన అడ్డుకుందన్నారు. ఈ చర్య ప్రజల తీర్పును వ్యతిరేకిస్తున్నట్లేనని స్పష్టం చేశారు. బ్రిటీష్ వాళ్లు తమ స్వార్థ రాజకీయాల కోసం పెద్దల సభ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఈ అంశాన్ని గాంధీజీ గమనించి 1931లోనే పెద్దల సభను వ్యతిరేకించారన్నారు. పెద్దల సభ తాత్కాలిక చర్య అని, శాశ్వత ప్రాతిపదికను రాజ్యాంగంలో అంబేద్కర్ ఇవ్వలేనన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు అడ్డుకునే వ్యవస్థ అవసరమా? అని ప్రశ్నించారు. ప్రజలు తిరస్కరించిన వ్యక్తి మండలి గ్యాలరీలో కూర్చుని అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా అని ప్రశ్నించారు. మండలిలో ప్రభుత్వ నిర్ణయాలను తిరస్కరించడం ప్రజా తీర్పును అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించారు. రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారని, దీంతో ప్రతిష్టంభన నెలకొందన్నారు. రాజ్యాంగబద్ధం కాని సిఫారసును ఆమోదించాలా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని, ముఖం చూపించలేక, భయపడి సభకు రాలేదని వ్యాఖ్యానించారు. మండలి రద్దు తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు తెలిపారు.

*చిత్రం... అసెంబ్లీలో మాట్లాడుతున్న ధర్మాన ప్రసాదరావు