ఆంధ్రప్రదేశ్‌

అన్ని వర్గాలకూ సంక్షేమ ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 26: ధర్మాన్ని మనం ఆచరిస్తే అది మనల్ని కాపాడుతుందని, రాష్ట్రంలో కుల, మత, జాతి, పార్టీ భేదాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు సమాజంలోని ప్రతిఒక్క సామాజిక వర్గానికి అందేలా చూడాలనేది ముఖ్యమంత్రి జగన్ అభిమతమని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్‌గా నియమితులైన ఎమ్మెల్యే మల్లాది విష్ణు నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం పదవీ ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ సౌమ్యుడు, వివాద రహితుడు, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉన్న విష్ణు వంటి సమర్థవంతుడి నేతృత్వంలో బ్రాహ్మణ సమాజానికి మేలు జరుగుతుందనే భావనతో ముఖ్యమంత్రి సంస్థ చైర్మన్‌గా నియమించారన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలకు భగవంతునికి మధ్య వారథి లాంటివారు బ్రాహ్మణులని, అయితే ఆ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రభుత్వానికి వారథి లాంటివాడు విష్ణు అని అన్నారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్‌కు మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించిందన్నారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు గతంలో ఉన్న రూ. 5వేలను రూ. 10వేలు పెంచే విషయంపై సర్వే చేస్తున్నామన్నారు. బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్‌గా పదవీ ప్రమాణస్వీకారం చేసిన మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్రంలోని బ్రాహ్మణుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి తనకు ఈ పదవి ఇచ్చారన్నారు. ఆయన ఆశయానికి అనుగుణంగా బ్రాహ్మణుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో సంక్షేమ హాస్టళ్లు పెట్టాలని ఆలోచిస్తున్నామన్నారు. మార్చి ఆఖరులోపు విదేశీ విద్యాదీవెన పథకం డబ్బును జమ చేస్తామని, త్వరలోనే అర్హులకు ఇళ్లస్థలాలు కూడా ఇవ్వబోతున్నామన్నారు.
తనకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ మీడియా సలహాదారులు దేవులపల్లి అమర్, శ్రీరామచంద్రమూర్తి, టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు జోగి రమేష్, రక్షణనిధి, జగన్మోహనరావు, 13 జిల్లాల నుండి బ్రాహ్మణ సంఘాల వారు హాజరై మల్లాది విష్ణును ఘనంగా సత్కరించారు.

'చిత్రం... బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన మల్లాది విష్ణును అభినందిస్తున్న స్పీకర్ తమ్మినేని