ఆంధ్రప్రదేశ్‌

శక్తిమంతమైన హిందూ సమాజమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 26: శతాబ్దాలుగా మన దేశ సంస్కృతి సంప్రదాయాలపై జరుగుతున్న దాడులు, ధార్మిక మూలాలను బలహీనపరిచే దుష్ప్రయత్నాలను ఇక హిందూ సమాజం సహించే పరిస్థితి పోయి శక్తిమంతమైందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దక్షిణాది రాష్ట్రాల క్షేత్ర ప్రచారక్ శ్యామ్‌కుమార్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ ఆదివారం విజయవాడలో పథ సంచలన్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో క్షేత్ర ప్రచారక్ శ్యామ్‌కుమార్ మాట్లాడుతూ పొరుగున ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ దేశాల్లో అల్ప సంఖ్యాకులైన హిందువులు, తదితర ఆరు మతాలకు చెందిన వారిని తీవ్రస్థాయిలో వేధించి మతమార్పిడులు, రక్తపాతం సృష్టించడం వల్ల వారు దిక్కులేని పరిస్థితుల్లో భారత్‌లోకి శరణుకోరి వస్తే ఆశ్రయం ఇవ్వడం తప్పా? అని ప్రశ్నించారు. శరణుకోరే వారిని అక్కున చేర్చుకోవడం తరతరాలుగా వస్తున్న మన సంప్రదాయం కాదా అని శ్యామ్‌కుమార్ ప్రశ్నించారు. అక్రమ చొరబాటుదారుల పట్ల మాత్రం కఠినంగా ఉండాలన్నారు. మతమార్పిడుల ద్వారా కొన్ని శక్తులు ఈ దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రమాదకారులుగా పరిణమించాయని, దేశాన్ని ధిక్కరించేలా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారన్నారు. 370 అధికరణ విషయంలో కూడా 70ఏళ్ల సమస్యకు ఎట్టకేలకు ఇటీవల విముక్తి కలిగిందని, ఇవన్నీ తిరిగి హిందువులు శక్తిమంతం అవుతున్నారనడానికి నిదర్శనమని చెప్పారు. భారతమాత, డాక్టర్ హెడ్గేవార్, గురూజీ గోల్వాల్కర్ చిత్రపటాలను ఊరేగిస్తూ జరిపిన ఈ పథ సంచలన్‌కు దారిపొడువునా స్థానికులు పూలవర్షం కురిపిస్తూ భారత మాతాకు జై అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ విజయవాడ విభాగ్ సంఘచాలక్ నార్ల వినయకుమార్, మహానగర్ కార్యవాహ వల్లూరు మదన్‌మోహన్, తదితరులు పాల్గొన్నారు.
'చిత్రం...కార్యక్రమంలో ప్రసంగిస్తున్న శ్యామ్‌కుమార్