ఆంధ్రప్రదేశ్‌

సేద్యానికి ప్రత్యేకంగా సోలార్ విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 26: రైతుల శ్రేయస్సు దృష్ట్యా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని శాశ్వత పథకంగా మార్చేందుకు ప్రభుత్వం మార్గాలు అనే్వషిస్తోందని, ఇందుకోసం దేశంలోనే తొలిసారిగా 10వేల మెగావాట్ల సామర్ధ్యంతో భారీ సౌర ఇంధన ప్రాజెక్టు చేపట్టాలని యోచిస్తున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి తెలిపారు.
సుమారు రూ. 35వేల కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. విజయవాడ విద్యుత్ సౌధాలో ఆదివారం ఘనంగా జరిగిన 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శ్రీకాంత్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలన, సామాన్య ప్రజలు, రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడంలో భాగంగా ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
దీనిలోభాగంగా విద్యుత్ రంగంలోనూ నవరత్నాల అమలుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. వ్యవసాయానికి పగటిపూటే 9గంటల విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని మరింత మంది రైతులకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈమేరకు ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి 50వేల నూతన వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించిందని, ఇందులోభాగంగా ఇప్పటికే 25వేలు మంజూరు చేయడంతో రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ కనెక్షన్ల సంఖ్య 18.1 లక్షలకు చేరుకుందని తెలిపారు. ఉచిత విద్యుత్ సరఫరా కోసం ఫీడర్లు సాంకేతికంగా మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రూ. 1700 కోట్లు మంజూరు చేసిందన్నారు. మొత్తం 6,663 ఫీడర్లకు గాను 80 శాతం వరకు ప్రస్తుతం ఉచిత విద్యుత్ సరఫరాకు అనుకూలంగా ఉన్నాయన్నారు. హెయిర్ కటింగ్ సెలూన్లకు నెలకు 150 యూనిట్లు, చేనేత మగ్గాలకు ఒక్కో కనెక్షన్‌కు నెలకు 100 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. ఈ ఏడాదిలో ఎన్టీటీపీఎస్ ఐదవ దశ 800 మెగావాట్లు, శ్రీ దామోదరం సంజీవయ్య ధర్మల్ పవర్ స్టేషన్ కృష్ణపట్నం రెండవ దశ 800 మెగావాట్లు పూర్తి కానున్నాయని శ్రీకాంత్ వివరించారు. కార్యక్రమంలో జేఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు, ఏపీ ట్రాన్స్‌కో ఫిన్ అండ్ హెచ్‌ఆర్‌డీ కే వెంకటేశ్వరరావు, జేఎండీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఏపీ ట్రాన్స్‌కో జీ సురేంద్రబాబు, చీఫ్ ఇంజనీర్ ట్రాన్స్మిషన్ సీవీఎస్ సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.