ఆంధ్రప్రదేశ్‌

గవర్నర్ ప్రసంగంలో ఈ తేడా ఏమిటబ్బా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 26: 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేసిన ప్రసంగంలో ఏదో తేడా వచ్చినట్లుగా అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. దాదాపు 15ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రానికి, విభజన తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాలకూ గవర్నర్‌గా వ్యవహరించిన ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగం, నేటి గవర్నర్ హరిచందన్ ప్రసంగంలో కొట్టొచ్చినట్లు ఈ తేడా కనిపించింది. సాధారణంగా ఏడాదిలో కనీసం రెండుసార్లు గవర్నర్ అధికార పార్టీ రూపొందించే ప్రసంగాన్ని తు.చ.తప్పక చదవటం సంప్రదాయంగా వస్తోంది. ఒకటి రిపబ్లిక్ డే, రెండోది బడ్టెట్ సమావేశాలకు ముందు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. నాటి గవర్నర్ నరసింహన్ తన ప్రసంగంలో ప్రతి పేజీలోనూ కనీసం రెండుసార్లు నా ప్రభుత్వం అంటూ ప్రస్తావించేవారు. అలాంటిది నేటి గవర్నర్ హరిచందన్ ఆదివారం చేసిన తొలి ప్రసంగంలో దాదాపు 32 పేజీల్లో ఎక్కడా, కనీసం ఒక్కసారి కూడా ‘నా ప్రభుత్వ’మనే ప్రస్తావన చేయలేదు. అయితే ప్రతి పథకాన్ని వివరిస్తూనే ప్రభుత్వం, ప్రభుత్వం అంటూనే ఆయన ప్రసావించడం చర్చనీయాంశంగా మారింది.