ఆంధ్రప్రదేశ్‌

రాజ్యాంగం నిర్ధేశించిన విధుల గురించి తెలుసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 25: బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలంటే మన హక్కులతో పాటు మనకు రాజ్యాంగం నిర్దేశించిన విధుల గురించి కూడా తెలుసుకోవాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. శనివారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 10వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని అధికారులకు అవార్డులను అందించారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న జాతీయ ఓటర్ల దినోత్సవంలో తాను కూడా భాగస్వామ్యం అవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకునే సందర్భంలో
మనకు రాజ్యాంగం కల్పించిన ఓటు శక్తిని కూడా తెలుసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రతి ఏడాది జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ఓటు హక్కు అనేది కేవలం యాంత్రికంగా ఉపయోగించునే హక్కు కాదని ప్రజాస్వామ్యం మనుగడకు అత్యంత బలమైన ఆయుధమన్నారు. ముఖ్యంగా యువత తమ ఓటును నమోదు చేయించుకోవడంతో పాటు తమ స్నేహితులను కూడా ఓటర్లుగా నమోదు చేసుకునేలా బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ రాష్ట్రంలో జరుగుతోందని, తుది ఓటర్ల జాబితా ఫిబ్రవరి 14న ప్రచురిస్తారన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కే విజయనంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత డిసెంబర్ 23వ తేదీ నాటికి 3.98 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారని, అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రత్యేక అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్ రమేష్‌కుమార్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను జోడించి ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రపంచంలో ఎన్నో దేశాల కంటే ముందు ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ డా కే మాధవిలత, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కే రక్షణనిధి, జేసీ 2 కే మోహన్‌కుమార్, సబ్ కలెక్టర్ హెచ్‌ఎం ధ్యానచంద్ర, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

'చిత్రం...కార్యక్రమంలో మాట్లాడుతున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్