ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ 27కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 23: రాష్ట్ర శాసనసభ సమావేశాలు 27కు వాయిదా పడ్డాయి. ముందుగా ఈ నెల 20 నుంచి 22 వరకే సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో సమావేశాలను పొడిగించాల్సి వచ్చింది. గురువారం వరకు పూర్తి స్థాయిలో సమావేశాలు జరిగాయి. తొలి రోజునే ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల్ని ప్రవేశపెట్టింది. ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు చర్చ జరిగింది. 21న ఉదయం 10 నుంచి ప్రారంభమై రాత్రి 10.30 గంటల వరకు కొనసాగింది. తిరిగి 22న ఉదయం 10 నుంచి రాత్రి 7.30 గంటల వరకు నిర్వహించారు.
మండలిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో గురువారంతో పాటు మరికొన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. శాసనమండలిలో బిల్లులు సెలక్ట్ కమిటీకి పంపటాన్ని సవాల్‌గా తీసుకున్న ప్రభుత్వం మండలి ఉంచాలా? కొనసాగించాలా అనే అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను పొడిగించింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం మంత్రివర్గ సమావేశం నిర్వహించిన అనంతరం 10గంటలకు సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే మండలి రద్దుకు సంబంధించిన నిర్ణయం తీసుకోనున్నారు.