ఆంధ్రప్రదేశ్‌

రక్షణ రంగ ఉత్పత్తుల్లో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: రక్షణ రంగంలో పెట్టుబడుల ప్రవాహం వచ్చేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో గురువారం రక్షణ రంగ ప్రతినిధులు, పరిశ్రమలు, ఐటీ శాఖ అధికారులు మంత్రితో సమావేశమయ్యారు. డిఫెన్స్ రంగానికి సంబంధించిన పరిశ్రమలను, తయారీ యూనిట్లను నెలకొల్పేలా ముందుకెళ్లాలని రక్షణ, పరిశ్రమలు, ఐటీ రంగాల అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రక్షణ రంగ ప్రతినిధులు పరిశ్రమల శాఖ కార్యదర్శి రజత్ భార్గవ, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
ఫ్రెంచ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ‘ఏఎఫ్‌డీ’ భేటీ
కొచ్చి మెట్రో, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల వంటి ప్రఖ్యాత ప్రాజెక్టులకు ఆర్థిక సహాయమందించి దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఏఎఫ్‌డీ అనే ఫ్రెంచ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ రాష్ట్భ్రావృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో యువతకు నైపుణ్య శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం అందించే అత్యున్నత చదువులకు కావాల్సిన శిక్షణ కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఏఎఫ్‌డీ ప్రతినిధుల బృందం మంత్రి మేకపాటికి స్పష్టం చేశారు. అనేక రంగాల్లో ఫ్రెంచ్ ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయమందించి ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యమవనున్న ట్లు ఏఎఫ్‌డీ ప్రతినిధులు బృందం వెల్లడించింది.