ఆంధ్రప్రదేశ్‌

ఇంగ్లీష్ విద్య ఓ హక్కు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: దశాబ్దాల కాలంగా చదువుకు దూరం అవుతున్న పేద పిల్లల జీవితాల్లో వెలుగులు నిండాలనే సంకల్పంతోనే ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. వేలు వెచ్చించి ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులను అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులాల్లో పేదల బతుకులు మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. శాసనసభలో గురువారం ‘ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982’ సవరణ బిల్లుకు సభ్యులు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. ఈ బిల్లును గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన శాసనసభ ఆమోదించిన అనంతరం శాసనమండలికి పంపారు. అయితే కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ మండలి బిల్లును తిరస్కరించింది. దీంతో ఈ సమావేశాల్లో బిల్లును తిరిగి ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకున్నారు. శాసనమండలి ప్రతిపాదనలను శాసనసభ తిరస్కరించటం గమనార్హం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని దశాబ్దాల కాలంగా పేదవర్గాలు నిరీక్షిస్తున్నారన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు వేలు వెచ్చించి
ప్రైవేట్ విద్యా సంస్థలను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనే సంకల్పంతోనే రూపాయి ఖర్చు లేకుండా ఆంగ్లంలో బోధన అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని ప్రాథమిక దశ నుంచే ఇంగ్లీష్ నేర్చుకుంటే బాహ్య ప్రపంచంతో పోటీ పడే అవకాశాలు మెరుగవుతాయన్నారు. కంప్యూటర్ ఆన్ చేసినా, ఉద్యోగం రావాలన్నా ఇంగ్లీష్ మీడియం తప్పని సరన్నారు. పేదలు పేదరికంలోనే మగ్గాలనే కుట్రతో గత పాలకులు పేద విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. ఈ కారణంగానే ప్రభుత్వ పాఠశాలల్లో 23.6 శాతం మంది మాత్రమే ఇంగ్లీష్ విద్యను అభ్యసిస్తున్నారని, ప్రైవేట్ విద్యా సంస్థల్లో 98.5 శాతం మంది చదువుకుంటున్నారని తెలిపారు. పేద పిల్లల బతుకులు మార్చాలనే ఉద్దేశంతో వారి జీవితాలను బాగుచేసే సంకల్పంతో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్‌కు బదులుగా రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకురావాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. ఇలాంటి బిల్లును కూడా మండలిలో అడ్డుకున్నారని, తిరస్కరించారని, అయినా తిరిగి శాసనసభలో ఆమోదించు కోగలిగామన్నారు. శాసనసభకు వెళితే బిల్ పాస్ అవుతుందని తెలిసి కూడా అడ్డుకోవటం అవివేకమన్నారు. ‘జగన్ మామ’ తోడుగా, అండగా ఉన్నందునే పేదలకు ఇంగ్లీష్ మీడియం హక్కుగా వచ్చిందన్నారు. ప్రతి అడుగులో పిల్లల జీవితాల్లో మార్పు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు తీసుకు రావటంతో పాటు జూన్ 1న పాఠశాలలు పున ప్రారంభానికి ముందే 36 లక్షల 10 వేల మంది పిల్లలకు విద్యా కానుకగా రూ. 1355 విలువచేసే కిట్లను పంపిణీ చేయనున్నట్లు పునరుద్ఘాటించారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ. 487 కోట్ల మేర భారం పడుతుందన్నారు. అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం, నాడు- నేడు, మధ్యాహ్న భోజన పథకంలో మెనూ మార్పుచేసి గోరుముద్ద పేరుతో నాణ్యత ప్రమాణాలతో పౌష్టికాహారాన్ని అందించటం, పాఠశాలల్లో పూర్తి వౌలిక సదుపాయాల కల్పన ద్వారా అణగారిన వర్గాలకు అండగా నిలవాలనేదే తమ లక్ష్యంగా తెలిపారు. కాగా చట్టసవరణ బిల్లును విద్యాశాఖ మంత్రి తరుపున వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యేలు వెంకట్రావు, మధుసూదనరావు, శ్రీనివాసులు, అదీప్ రాజు, కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు ఆంగ్ల విద్యా బోధనకు సంపూర్ణ మద్దతు పలికారు. అనంతరం అధికార పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
'చిత్రం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి