ఆంధ్రప్రదేశ్‌

ముఖ్యమంత్రి జగన్‌తో నెదర్లాండ్స్ ప్రతినిధుల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 22: నెదర్లాండ్స్‌కు చెందిన ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం శాసనసభ ప్రాంగణంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో నెదర్లాండ్స్ ప్రతినిధులు కొద్దిసేపు భేటీ అయ్యారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులకు అనువైన అవకాశాల గురించి ముఖ్యమంత్రి వివరించారు.
విద్యుత్ ఉద్యోగుల సంఘం డెయిరీ ఆవిష్కరణ
వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర డెయిరీ, క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్‌కు అభినందన
రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్‌ను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలోని చాంబర్‌లో ప్రసాద్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు.
'చిత్రం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన నెదర్లాండ్స్ ప్రతినిధులు