ఆంధ్రప్రదేశ్‌

అప్రజాస్వామికం రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో చైర్మన్ తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమని శాసనసభ వ్యవహారాలు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఖండించారు. రాజధాని వికేంద్రీకరణ.. సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ సందర్భంగా బుధవారం రాత్రి శాసనమండలిలో జరిగిన పరిణామాలు దురదృష్టకరమన్నారు. చైర్మన్ ఏకపక్ష నిర్ణయంతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దురుద్దేశంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మండలిలో బలం ఉందనే అహంకారంతో చైర్మన్‌ను ప్రభావితం చేశారని మండిపడ్డారు. గత రెండు రోజులుగా శాసనమండలిలో బిల్లును ఆమోదిస్తారో లేదో తేల్చకుండా విచక్షణాధికారాల పేరుతో సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్లు చైర్మన్ ప్రకటించడం అప్రజాస్వామికమన్నారు. శాసన వ్యవహారాల్లో అనుభవం ఉన్న సీనియర్ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు.
బిల్లుల్ని మండలిలోకి అనుమతించక ముందే సెలక్ట్ కమిటీకి అప్పగించే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చర్చ అనంతరం వ్యతిరేకిస్తే తిరిగి శాసనసభకు పంపాల్సి ఉందన్నారు. అలాంటివేమీ లేకుండా అనైతికంగా టీడీపీ సభ్యులు వ్యవహరించారని దుయ్యబట్టారు. రూల్-71ను అడ్డం పెట్టి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల చట్టసభల పట్ల గౌరవం ఉండదన్నారు. ఓటు ద్వారా ఎన్నుకున్న శాసనసభ ఆమోదించిన బిల్లును నామినేటెడ్‌గా ఎన్నికైన సభ తిరస్కరించడం దారుణమన్నారు. ఇలాంటి పరిణామాలు ఎక్కడా చూడలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే రూల్-71 ఉందని ఇతర ఏ చట్టసభల్లో లేదన్నారు. దీన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు డ్రామాలాడారని విమర్శించారు. బిల్లులపై ఓటింగ్ పెట్టకుండా స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చారని, తీర్మానం ప్రవేశపెట్టకుండా 21వ తేదీతో తప్పుడు పత్రాలు సృష్టించారని అభ్యంతరం తెలిపారు.
సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక: బుగ్గన
రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక వేస్తున్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. వికేంద్రీకరణ బిల్లుపై జరిగిన చర్చకు మంత్రి బదులిస్తూ, పరిపాలనా వికేంద్రీకరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జోనల్ అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి పెట్టుబడిని భరించగలమా అని ప్రశ్నించారు. రాజధాని ఎంపికకు మధ్యలో ఉండటమే ప్రాతిపదిక కాదన్నారు.