ఆంధ్రప్రదేశ్‌

ప్రతి అడుగూ రైతుల కోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 22: ప్రభుత్వం వేసే ప్రతి అడుగు రైతుల కోసమే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతాంగ సమస్యలన్నీ ఈ కేంద్రాల ద్వారానే పరిష్కారమయ్యే విధంగా తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పంటలు, భూసార పరీక్షలు, ఎరువుల వినియోగం, విత్తనాలు తదితర అంశాల్లో అవగాహన కల్పించేందుకు నిపుణుల కమిటీని నియమిస్తామన్నారు. శాసనసభలో బుధవారం ‘రైతు భరోసా కేంద్రాల’పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 11వేల 158 గ్రామ సచివాలయాలు ప్రారంభం కానున్నాయని వాటికి అనుసంధానంగా భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఫిబ్రవరిలో 3300, మార్చిలో 5300, ఏప్రిల్ నెలలో మిగిలిన కేంద్రాలు ఏర్పాటవుతాయని వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు. గ్రామీణ ఆర్థికాభివృద్ధి కేంద్రాలుగా వీటిని తీర్చి దిద్దుతామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీసీ) నుంచే అన్నిరకాల లావాదేవీలు జరుగుతాయని చెప్పారు. ఉత్తమ వ్యవసాయ విధానాలపై అవగాహన పెంచేందుకు వ్యవసాయ నిపుణులను నియమిస్తామన్నారు. అదేవిధంగా ప్రతి కేంద్రంలో సంబంధిత సచివాలయ ఉద్యోగులు పని చేస్తారని, నిపుణుల కమిటీ ప్రాంతాల వారీగా అనువైన పంటలు, ప్రత్యామ్నాయ వనరులు, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తారన్నారు. ఈ కేంద్రాల్లోనే విత్తనాల నాణ్యత, ఎరువులు, పురుగుమందుల పరిశీలన జరుపుతారని వివరించారు. కల్తీలను నియంత్రించటంతో పాటు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను కూడా ఈ కేంద్రాల్లోనే విక్రయించే విధంగా తగిన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ప్యాకింగ్‌లపై అధికారిక ముద్ర ఉంటుందన్నారు. నకిలీలు, కల్తీలతో
రైతులు నష్టపోయే పరిస్థితి రాకూడదన్నారు. చేపలు, రొయ్యలకు సంబంధించిన సీడ్స్, ఫీడ్స్ రైతు భరోసా కేంద్రాల్లో లభ్యమవుతాయని తెలిపారు. రైతులకు ఆరోగ్య కార్డులు మంజూరు చేయటంతో పాటు పంటలు, పశువులకు సంబంధించి రూపాయి చెల్లిస్తే మిగిలిన ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. దీని వల్ల ప్రభుత్వంపై రూ. 2100 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు ఆర్బీసీలో భూ సార పరీక్షల కార్డులు, విత్తనాల నాణ్యతను పరిశీలించే ల్యాబ్‌లు, ధాన్యం రైతులకు తేమను గుర్తించే మీటర్లు ఇతర యంత్ర పరికరాలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. పంటలకు గిట్టుబాటు ధర వస్తేనే విక్రయించాలని దళారులు మార్కెట్ మాంద్యం సృష్టించి తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని అవసరమైతే రైతు భరోసా కేంద్రాల నుంచే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రాపింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా గత ప్రభుత్వ నిర్వాకంతో అవస్థలు పడుతున్నా రైతు సంక్షేమం విషయంలో వెనక్కు తగ్గేదిలేదని భరోసా ఇచ్చారు. రైతు భరోసా కింద ఈ ఏడాది రూ. 13వేల 500 చొప్పున 46 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని వివరించారు. అప్పుల ఊబి నుంచి కాపాడేందుకు వైఎస్సార్ వడ్డీలేని రుణాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇప్పటికే అమల్లో ఉందని గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6663 వ్యవసాయ ఫీడర్ల ద్వారా 60 శాతం ఉచిత విద్యుత్ అందిస్తున్నామని మరో 40 శాతం సరఫరాకు రూ. 17 వందల కోట్లు మంజూరు చేశామన్నారు. జూలై నుంచి పూర్తి స్థాయిలో నూరు శాతం పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని నిరాటంకంగా అమలు చేస్తామన్నారు. ఇకపై పశువులకూ హెల్త్ కార్డులు ముంజూరు చేయనున్నట్లు ప్రకటించారు.
'చిత్రం... సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి