ఆంధ్రప్రదేశ్‌

కింకర్తవ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 22: మూడు రాజధానులపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి శాసనమండలిలో చుక్కెదురవటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భవిష్యత్ వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. ఈనెల 20వ తేదీన పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనసభ ఆమోదించిన అనంతరం 21న శాసనమండలికి పంపించారు. మండలిలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి సంఖ్యా బలం ఉండటంతో నాటకీయ పరిణామాల నేపథ్యంలో బుధవారం సెలక్ట్ కమిటీకి బిల్లులను బదలాయిస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం శాసనసభ ఈనెల 20 నుంచి 22 వరకు, శాసనమండలి 21వ తేదీన మాత్రమే సమావేశమవ్వాల్సి ఉంది. అయితే మండలిలో పరిణామాల నేపథ్యంలో గురువారం కూడా శాసనసభ సమావేశాలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉండగా బిల్లులపై భవిష్యత్ కార్యాచరణను చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాత్రి పొద్దుపోయాక అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమై చర్చించినట్లు సమాచారం. బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళితే మూడు నెలల కాల వ్యవధి పడుతుంది. ఆ తరువాత కూడా గడువు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారంపై ఎలా ముందడుగు వేయాలనేది అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. బిల్లులు నెగ్గించుకునేందుకు ప్రభుత్వం ముందు రెండు మార్గాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఆర్డినెన్స్ ద్వారా ఆమోదించుకోవటం ఒక ఎత్తయితే కేబినెట్‌ను సమావేశపరచి మండలిని రద్దు చేయటం మరో అంశంగా పరిశీలన జరుపుతున్నారు. అయితే ఒకసారి మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్న తరువాత ఏ రకంగా స్పందించాలనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో సీఎం జగన్, మంత్రులు అడ్వొకేట్ జనరల్‌తో సంప్రతింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ముందుగా మండలి చైర్మన్
వ్యవహరించిన తీరు రాజ్యాంగ బద్ధమా? కాదా అనేది తేలాల్సి ఉందంటున్నారు. బిల్లులపై తీర్మానం ప్రవేశపెట్టకుండా నిర్ణయం తీసుకోలేమని చెప్తూనే తన
విచక్షణాధికారాలతో సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్లు మండలి స్పీకర్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై న్యాయ నిపుణులను సంప్రతించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజధాని తరలింపును నిలిపివేయాలంటూ ఓ వైపు రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. వీటిపై విచారణ ప్రారంభమైంది. రాజధాని విషయంలో రాష్ట్రానికి అధికారం ఉన్నప్పటికీ కేంద్ర జోక్యంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంతో పాటు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు, హైకోర్టు కేసులు దాటుకుని ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై ముఖ్యమంత్రి జగన్ మంత్రులతో చర్చించినట్లు సమాచారం. కాగా బుధవారం శాసనసభ సమావేశం అర్థంతరంగా ముగియటంతో గురువారం చర్చలు ముగించి నిరవధిక వాయిదా వేయాలనే యోచనతో ఉన్నట్లు తెలిసింది.
'చిత్రం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి