ఆంధ్రప్రదేశ్‌

‘ఇన్‌సైడర్’పై సమగ్ర దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభ సమావేశాల్లో భాగంగా బుధవారం రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఈ మేరకు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. రాజధాని ప్రాంతంలో 4070 ఎకరాల మేర ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ తేల్చింది. గత ఏడాది జూన్ 26వ తేదీన ఏర్పాటైన ఈ కమిటీ రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి వివరాలు సేకరించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఇందులో కొందరు వ్యక్తిగతంగా, మరికొన్ని సంస్థలు భూముల అక్రమ లావాదేవీల్లో భాగస్వాములయ్యారని గుర్తించింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌తో సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై అభియోగాలతో నివేదిక రూపొందించింది. రాజధాని ప్రాంతంలో చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థతో పాటు మాజీ మంత్రి నారాయణ, బీజేపీ ఎంపీ సుజనాచౌదరి, మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణ, మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్ తదితరులు భూములు కొనుగోలు చేశారని, ఎన్‌ఓసీ సర్ట్ఫికెట్లతో వ్యవసాయ భూములను నివాస, వాణిజ్య అవసరాలకు మార్చుకున్నారని కమిటీ ఆరోపించింది. శాసనసభ
సమావేశాల తొలిరోజునే ఈ అంశం చర్చకు వచ్చింది. దీనిపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ఈ వ్యవహారాన్ని దర్యాప్తు సంస్థలకు అప్పగించటం ద్వారా మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రాగలవని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అవకాశమివ్వాలని ప్రవేశపెట్టిన తీర్మానంపై స్పీకర్ తమ్మినేని సీతారాం చర్చకు అనుమతిచ్చారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరపాలని స్పీకర్ కూడా ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ప్రభుత్వ విప్ కాపు రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికారంలో ఉండగా అయిన వారికి అప్పనంగా భూములు దోచిపెట్టారని ఆరోపించారు. రాజధాని ప్రకటనకు ముందే భూములు కొనుగోలు చేశారని అంతకు ముందు రాజధాని మరోచోట ఏర్పాటు చేస్తున్నట్లు లీకులు ఇచ్చారని విమర్శించారు. రైతుల భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించడం ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీశారన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజధాని నూజివీడు అంటూ ప్రచారం చేసి దొడ్డిదారిన అమరావతిగా ప్రకటించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అక్రమాలన్నింటిపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని కోరారు.

'చిత్రం... అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడుతున్న హోంమంత్రి సుచరిత