ఆంధ్రప్రదేశ్‌

సెలక్ట్ కమిటీకి ఆ రెండు బిల్లులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి నివేదిస్తున్నట్లు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ షరీఫ్ బుధవారం రాత్రి ప్రకటించారు. దీంతో ఈ బిల్లులు దాదాపు మూడు నెలలు పెండింగ్‌లో పడే అవకాశం ఉంది. ఉద్రిక్తత, ఉత్కంఠ మధ్య చైర్మన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించడంతో మండలిలో టీడీపీది పైచేయి అయింది. శాసన మండలిలో పై రెండు బిల్లులపై చర్చ జరిగిన తరువాత, మంత్రు లు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ బదులిచ్చారు. అనంతరం ఈ బిల్లులను ఆమోదించాలని బుగ్గన కోరారు. దీనిపై మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అభ్యంతరం తెలిపారు. తాము
ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని కోరుతూ ఇప్పటికే సవరణలు ఇచ్చామని తెలిపారు. సవరణలను ప్రతిపాదించలేదని, దీంతో సెలక్ట్ కమిటీ ప్రశే్న లేదని బుగ్గన వాదించారు. దీంతో మంత్రులు సహా టీడీపీ, వైకాపా సభ్యులు పోడియం వద్దకు దూసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు మంత్రులు, వైకాపా సభ్యులు చాలా ప్రయత్నించారు. సెలక్ట్ కమిటీకి ఈ బిల్లులను పంపాలనే సవరణలను సభలో ప్రవేశపెట్టకపోవడంతో సాంకేతికంగా ఈ బిల్లులను కమిటీకి పంపడం సాధ్యం కాదు. దీంతో ఈ బిల్లులు సెలక్టు కమిటీకి పంపే అవకాశం లేదని భావించారు. సాంకేతిక సమస్య కారణంగా ఈ బిల్లును తిరస్కరించడం మినహా టీడీపీ భావించినట్లుగా సెలక్ట్ కమిటీకి పంపడం సాధ్యం కాదని భావించారు. ఈ దశలో సభలో గందరగోళం నెలకొనడంతో సభను 15 నిమిషాల సేపు వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. దాదాపు మూడు గంటల తరువాత తిరిగి మండలి సమావేశమైంది. ఈ సమయంలో మంత్రులు షరీఫ్ చాంబర్‌తో చర్చలు జరిపారు. టీడీపీ నేతలు కూడా షరీఫ్‌తో చర్చలు జరిపారు. మూడు గంటల పాటు సభలో ఉత్కంఠ నెలకొంది. చాలా సేపటి తరువాత సభ తిరిగి సమావేశమైన తరువాత చైర్మన్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఈ బిల్లులను సెలెక్టు కమిటీకి పంపకూడదని, కానీ తనకున్న విచక్షణాధికారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అనంతరం మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ఇలాఉంటే సెలక్ట్ కమిటీ పరిశీలనకు వెళ్లటంతో ఈ బిల్లులు దాదాపు మూడు నెలల పాటు పెండింగ్‌లో పడే అవకాశం ఉంది.