ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ ముట్టడి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 20: అమరావతి పరిరక్షణ సమితి, వివిధ రాజకీయ పక్షాలు, జేఏసీలు ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, మూడు రాజధానుల ప్రకటనను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి పిలుపునకు రాజధాని ప్రాంత రైతులు, మహిళలు, యువత నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అసెంబ్లీ ముట్టడి చట్టవిరుద్ధమని, అనుమతి లేదంటూ పోలీసులు విధించిన అనేక ఆంక్షలు, వేలాది మంది పోలీసుల మోహరింపు, నేతల గృహ నిర్బంధాలు, ముళ్ల కంచెల ఏర్పాటును దాటుకుని సోమవారం రాజధాని రైతులు కదం తొక్కారు. మంత్రివర్గ సమావేశం ముగిసేంత వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసెంబ్లీ పరిసర ప్రాంతాలు రైతుల తెగింపుతో ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అసెంబ్లీ పరిసర ప్రాంతాలు కురుక్షేత్ర రణరంగాన్ని తలపించాయి. మూడు రాజధానులకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్న వార్త రాజధాని ప్రాంతంలో దావాలనంగా వ్యాపించడంతో రైతులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. వెలగపూడి, తుళ్లూరు, మందడం తదితర ప్రాంతాల నుండి వందలాది మంది రైతులు, మహిళలు అసెంబ్లీని ముట్టడించేందుకు నలువైపుల నుంచి ఒక్కసారిగా కదలివచ్చారు. అసెంబ్లీ వెనుక ప్రాంతంలోని పొలాల ముళ్ల పొదలను ఆసరాగా చేసుకుని అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ముళ్ల కంపలను, పంటకాల్వలను సైతం రైతులు, మహిళలు లెక్కచేయకుండా ముందుకు కదిలారు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే రైతుల ఆగ్రహావేశాల ముందు పోలీసుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. వెనక్కి వెళ్లి పోవాలని, అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదంటూ పోలీసులు ఎంత చెప్పినప్పటికీ వినకుండా ముందుకు కదలడంతో పోలీసులు లాఠీలను ఝుళిపించారు. ఈ ఘటనలో పలువురు రైతులు, మహిళలకు గాయాలయ్యాయి. గాయాలను సైతం లక్ష్యపెట్టకుండా సచివాలయం, అసెంబ్లీ వైపు రైతులు దూసుకెళ్లారు. దీంతో పోలీసు అధికారులు అదనపు బలగాలను రప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ వైపు దూసుకెళ్తున్న వారిని ఎక్కడికక్కడ అటకాయించి అరెస్ట్ చేశారు. రైతులు, మహిళలను వాహనాల్లో చుట్టుపక్కల ఉన్న అమరావతి, మంగళగిరి పోలీసుస్టేషన్‌లకు తరలించే క్రమంలో వివిధ రూట్లలో పోలీసులు వాహనాలను మళ్లించి మిగిలిన రైతుల కళ్లుగప్పే ప్రయత్నం చేశారు. పోలీసు వాహనాల్లోనే ఆందోళనకారులు జై అమరావతి, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మందడంలో అరెస్ట్ చేసిన రైతులను పోలీసులు పెదకాకాని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, మహిళలు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానుల ప్రకటనను తాము అంగీకరించేది లేదని, తమ ప్రాణాలైనా అర్పిస్తామని స్పష్టంచేశారు. ఇది తమకు జీవన్మరణ సమస్య అని, ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా ఆందోళనకారులను అడ్డుకునే క్రమంలో తీవ్రస్థాయిలో పెనుగులాట, తోపులాటలు జరిగిన మీదట రైతులతో పాటు పోలీసులకు సైతం గాయాలయ్యాయి. ఇలా ఉండగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అసెంబ్లీ ముట్టడికి రైతులతో కలిసి జాతీయ జెండాలను చేతబూని ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో కలిసి సచివాలయం రెండవ గేటు సమీపంలోకి రావడంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఎంపీ జయదేవ్, రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట చోటు చేసుకుంది. ఒకానొక సమయంలో ఎంపీ జయదేవ్ రోడ్డుపై పడిపోవడం, రైతులు, మహిళలు పోలీసులపై విరుచుకుపడటంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ పెనుగులాటలో జయదేవ్ చొక్కా చిరిగింది. అనంతరం పోలీసులు జయదేవ్‌తో పాటు పలువురు రైతులను అరెస్ట్ చేసి నర్సరావుపేట పోలీసుస్టేషన్‌కు తరలించారు. నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని, రైతులపై పోలీసులు అనుసరిస్తున్న తీరు అమానుషమని జయదేవ్ మండిపడ్డారు. రాజధాని జిల్లా కేంద్రమైన గుంటూరులో రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ఇంటిని రాజధాని జేఏసి నాయకులు ముట్టడించారు. అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో జేఏసి, వివిధ రాజకీయ పక్షాల నేతలను పోలీసులు ముందస్తుగా ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. ఆదివారం అర్ధరాత్రి నుండే దాదాపు 48 నియోజకవర్గాల్లో టీడీపీ ముఖ్యనేతలు, నాయకులను గృహనిర్బంధంలో ఉంచారు. గుంటూరు జిల్లాలో చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, వినుకొండలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, గుంటూరులో మరో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, చింతలపూడిలో మరో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పోలీసుల కళ్లు గప్పి ద్విచక్ర వాహనంపై అసెంబ్లీ ముట్టడికి వస్తున్న క్రమంలో బుడంపాడు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంత రాయప్ప చౌదరిని తాడేపల్లిలో పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌చేసి మంగళగిరి పోలీసుస్టేషన్‌కు తరలించారు.

''చిత్రాలు..అసెంబ్లీ వెనుక కాలువలో రైతుల నిరసన
*ఎంపీ గల్లా జయదేవ్‌ను అరెస్టు చేసి తీసుకువెళుతున్న పోలీసులు