ఆంధ్రప్రదేశ్‌

వాడివేడిగా బీఏసీ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 20: శాసనసభ సమావేశాల్లో భాగంగా బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం వాడివేడిగా సాగింది. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటుపై అధికార, విపక్ష సభ్యుల మధ్య పెద్దఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుకు కనీస సమయం ఇవ్వాలని టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. బిల్లును రెండు రోజులు ముందుగానే సభ్యులకు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారని గుర్తు చేశారు.
విశాఖపట్నం మావోయిస్టుల ఖిల్లా అని అక్కడ రాజధాని ఏర్పాటుచేస్తే అనర్థాలు తప్పవని హెచ్చరించారు. దీనిపై స్పీకర్ అభ్యంతరం తెలిపారు. అలాంటి వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో విశాఖలో ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు హతమార్చింది వాస్తవం కాదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రెండేళ్ల క్రితం వీళ్లను చంపింది మీరు, నేను కాదు కదా అని వ్యాఖ్యానించారు. దీనిపై స్పీకర్ మండిపడుతూ ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికే కట్టుబడి ఉందని, దీనికి ప్రజలు మద్దతిస్తారని స్పష్టం చేశారు.
'చిత్రం...స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం