ఆంధ్రప్రదేశ్‌

పోలీసు దిగ్బంధనంలో విజయవాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: మూడు రాజధానులకు వ్యతిరేకంగా వివిధ రాజకీయపక్షాలు, జేఏసీ సోమవారం నిర్వహించదలచిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం దృష్టా విజయవాడ నగరం, పరిసర ప్రాంతాలను పోలీసులు దిగ్బంధనం చేశారు. కృష్ణాజిల్లా వైపు నుంచి ఏ ఒక్క ఆందోళనకారుడు కూడా అమరావతి వైపు వెళ్లకుండా నివారించగలిగారు. రెండు జిల్లాలను కలిపే ప్రకాశం బ్యారేజీపైకి ఎవరినీ అనుమతించలేదు. తెల్లవారుజామున నుంచే ఎక్కడికక్కడే ముఖ్యనేతలను గృహనిర్బంధం చేశారు. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను అరెస్టు చేశారు. అలాగే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, ఇతర నేతలను కూడా గృహనిర్బంధం చేశారు. ఒకే రాష్ట్రం... ఒకే రాజధాని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నియంతృత్వంతో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించాలని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నిర్ణయించింది.