ఆంధ్రప్రదేశ్‌

రాజధాని రైతుల పరిహారం పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ప్రతి గ్రామ సచివాలయంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రిమండలి తీర్మానించింది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ సమావేశంలో కీలక బిల్లులతో పాటు ఐదు అంశాలపై చర్చించారు. సీఆర్డీఏ చట్టం రద్దు, రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను మంత్రివర్గం ఆమోదించింది. దీనిపై హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోదముద్ర పడింది. రాజధానిలో రైతులకిచ్చే పరిహారం పెంచు తూ నిర్ణయం తీసుకున్నారు. కౌలు చెల్లింపు గడువును పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పొడిగించారు. దీంతో పాటు భూమిలేని నిరుపేదలకిచ్చే పింఛన్‌ను రూ. 2500 నుంచి 5వేలకు పెంచేందుకు కేబినెట్ సానుకూలంగా స్పందించింది. పులివెందుల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం లో బోధన అంశాలను క్లుప్తంగా చర్చించారు. ప్రధానంగా రాజధాని వికేంద్రీకరణ బిల్లులపైనే చర్చ జరిగింది.
'చిత్రం...ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి