ఆంధ్రప్రదేశ్‌

బెదిరింపులు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 19: అసెంబ్లీని ముట్టడిస్తాం, దాడి చేస్తామంటూ బెదిరించటం సరికాదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. నగరంలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రజల సర్వతోముఖాభివృద్ధికి చట్టాలు చేయడమే చట్టసభ సమావేశాల లక్ష్యమన్నారు.
చట్టసభలకు హాజరు కాకుండా నిరోధించడం, అడ్డుకునేందుకు ప్రయత్నించడం కూడా సభ్యుల హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని చెప్పారు. సభ్యులు సభకు రాకుండా అడ్డుకోవడం కూడా సభాహక్కులను హరించడమేనని స్పష్టం చేశారు. చట్టసభలను అడ్డుకోవడం కూడా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడటమే అవుతుందని, చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టం తనపని తాను చేస్తుందన్నారు. ఏమి చర్యలు తీసుకోవాలో కూడా చట్టాల్లో నిర్దేశించారని గుర్తుచేశారు.
గతంలో ఇలాంటి సందర్భాల్లో జైలుశిక్ష పడిన ఘటనలూ ఉన్నాయన్నారు. చట్టసభల్లోకి అగంతకులు (సభ్యులు కానివారు) ప్రవేశించకుండా అడ్డుకునేందుకు నిబంధనలు ఉన్నాయని, వాటికి విరుద్ధంగా చట్టసభల్లోకి ప్రవేశిస్తే శిక్ష విధించే అధికారం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, అయితే చట్టానికి లోబడే అది ఉండాలన్నారు. చట్టసభలపై దాడి చేస్తాం, ముట్టడిస్తామని బెదిరించడం సరికాదన్నారు. సభ్యులు తమ అభిప్రాయాలను చట్టసభల్లో చెప్పుకునే అధికారం ఉందని, ఎవరి అభిప్రాయం వారు తెలిపే హక్కు, అధికారం వారికుందన్నారు. సభ్యుల భావస్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని, అందుకు భిన్నంగా తాము ఏదైనా చేస్తామంటే రాజ్యాంగపరంగా ఒప్పుకునేది లేదన్నారు. సభ్యులు తమ అభిప్రాయాలను సభలో చెప్పుకోవచ్చని, వారికి అది ఒక అవకాశమన్నారు. దాడులను అడ్డుకునేందుకు కార్యనిర్వాహక వ్యవస్థ ఉందని, చట్టసభలను సజావుగా, హుందాగా నిర్వహించేందుకు సభ్యులందరూ సహకరించాలని కోరుతున్నట్లు చెప్పారు.
చట్టసభల ఔన్నత్యాన్ని కాపాడేందుకు సభ్యులంతా హుందాగా వ్యవహరించాల్సి ఉందన్నారు. శాసనసభను అడ్డుకోవాలని ఒక సీనియర్ సభ్యుడు పిలుపు ఇవ్వడం భావ్యం కాదని, చలో అసెంబ్లీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం నుంచి శాసనసభా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. సభలో ఏయే అంశాలు చర్చించాలనే అంశాన్ని బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు జారీ చేయడంలో తప్పేమి ఉందని స్పీకర్ ప్రశ్నించారు. శాంతిభద్రల దృష్ట్యా సహకరించమని పోలీసులు కోరుతున్నారని వ్యాఖ్యానించారు.
ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. రాజధాని రైతులు తమ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని, సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేసి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం వివరించారు.
'చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న స్పీకర్ తమ్మినేని సీతారాం