ఆంధ్రప్రదేశ్‌

పచ్చమీడియా కీలుగుర్రంపై పుత్రరత్నాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), జనవరి 19: ఎన్నికల్లో ఘోర పరాభవం పొందిన నాటి నుండి ఇటు ఉత్తపుత్రుడు, అటు దత్తపుత్రుడు చేస్తున్న వెకిలి చేష్టలను చూసి రాష్ట్ర ప్రజలంతా విరగబడి నవ్వుకుంటున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. వెకిలి చేష్టలతో పరువు తీసుకోవద్దని వారికి ఎవరైనా చెప్పాలంటూ ఆదివారం ట్విట్టర్ వేదికగా సూచించారు. ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు పచ్చమీడియా అనే కీలుగుర్రం ఎక్కి స్వారీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రివ్వున ఎగిరినట్టు కలల్లో అందరూ తేలిపోతున్నారని వ్యాఖ్యానించారు. పరమ అవమానకరంగా పరాజయం పాలై ఆరునెలలు తిరగకముందే చిటికెలు వేస్తుంటే ప్రజలంతా నవ్వుకుంటున్నారని విమర్శించారు. ఎవరైనా చెప్పండయ్యా.. వెకిలి చేష్టలతో పరువు తీసుకోవద్దని’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.