ఆంధ్రప్రదేశ్‌

కునారిల్లుతున్న పునరావాసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 19: రాష్ట్ర జీవనాడి బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గతి తప్పినట్టుగా ఉంది. ప్రధానంగా నిర్వాసితుల పునరావాసం కునారిల్లుతోంది. పునరావాస కాలనీల నిర్మాణం అతీగతీ లేనట్టుగా సాగుతోంది. అఖండ గోదావరి నది కుడి గట్టు వైపు పోలవరం సమీపంలో పలు నిర్వాసిత కాలనీల నిర్మాణం చేపట్టారు. ఎడమ గట్టు వైపు ప్రధానంగా ముంపునకు గురయ్యే దేవీపట్నం మండలంలోని పలు గ్రామాలకు సంబంధించి కాంటూరు స్థాయిని బట్టి పునరావాస కాలనీల నిర్మాణం చేపట్టారు. ముంపునకు గురయ్యే నేలకోట గ్రామానికి సమీపంలోనే పునరావాస కాలనీ ఏర్పాటుచేశారు. డి రావిలంక, పరగసానిపాడు గ్రామాలకు పెదభీంపల్లి మోడల్ కాలనీ-1లో పునరావాస కాలనీ నిర్మాణం చేపట్టారు. అంగుళూరు గ్రామాన్ని ఖాళీ చేయించి సమీపంలోనే పునరావాస కాలనీ నిర్మాణం చేశారు. వీరవరం లంక గ్రామానికి పోలవరంలోను, తొయ్యేరుకు ముసల్లకుంట, పెనికెలపాడు, మడిపల్లి గ్రామాలకు పెదభీంపల్లి ఆర్‌అండ్‌ఆర్ కాలనీ-2లో పునరావాస కాలనీల నిర్మాణం చేపట్టారు. ఈ కాలనీలు ఇంకా పూర్తి కాలేదు. నిర్వాసితులు అక్కడకు వెళ్లలేదు. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో కేవలం నేలకోట, డి రావిలంక, పరగసానిపాడు, అంగుళూరు మాత్రమే ఖాళీ అయ్యాయి. అగ్రహారం, ఏనుగులగూడెం, మంటూరు గ్రామాలకు ఇందుకూరు ఆర్‌అండ్‌ఆర్ కాలనీ-1లోనూ, మూలమెట్ట, మెట్టవీధి గ్రామాలకు పోతవరం సమీపంలో కాలనీలు నిర్మించేందుకు స్థల సేకరణ చేశారు. మూలపాడు, గానుగులగొంది గ్రామాలకు ముసల్లకుంట సమీపంలో కాలనీ నిర్మాణం చేపట్టారు. లింగవరం, దేవీపట్నం, కొత్తగూడెం, తాటివాడ, తాళ్లూరు, మెట్టగూడెం, తాలిపేరు, కొండమొదలు గ్రామాలకు పెదభీంపల్లి వద్ద కాలనీల నిర్మాణం చేపట్టారు. నడిపూడి, సోమర్లపాడు, పెదగూడెం, కొక్కిరగూడెం తదితర గ్రామాలకు గంగవరం మండలంలో కాలనీలకు లేఅవుట్ వేశారు. కొత్తపల్లి, ఎ వీరవరం, దండంగి, పూడిపల్లి, జీడిగుప్ప, ఇసునూరు, కొల్లూరు, గండికోటలకు పునరావాస కాలనీల నిర్మాణం జరుగుతోంది. పోలవరం పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీకి సంబంధించి 2010-11 అంచనాల ప్రకారం రూ.2,934.42 కోట్ల నుంచి 2017-18కి రూ.32,509.26 కోట్లకు పెరిగింది. ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా కేంద్రం నుంచి
రూ.5112.76 కోట్లు రావాల్సి ఉంది. పోలవరం మొత్తం భూసేకరణలో 65వేల 236.50 ఎకరాలకు సంబంధించి ఇప్పటి వరకు రూ.4532.31 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 65వేల 40.17 ఎకరాలకు సంబంధించి రూ.4426.68 కోట్లు ఖర్చు చేశారు. ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించి రూ.3492.68 కోట్లకు గాను 3060.59 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ మొత్తం ప్రాజెక్టు చూసుకుంటే ఇప్పటివరకు 33 శాతమే పూర్తయినట్టు. ఇందులో మొత్తం పనులు 67.10 శాతం పూర్తయ్యాయి. ఇందులో హెడ్‌వర్క్సు 58.97 శాతం పూర్తి కాగా, ఆర్ ఎంసీ 91.69 శాతం, ఎల్‌ఎంసీ 69.96 శాతం, భూ సేకరణ, పునరావాస పునర్నిర్మాణం కేవలం 15.43 శాతమే పూర్తయింది.
పోలవరం ప్రాజెక్టు ద్వారా ముందుగా కాల్వల ద్వారా ప్రయోజనం మాత్రం ఇప్పటికే కొంత ప్రయోజనం సమకూరిందని చెప్పవచ్చు. 177 కిలో మీటర్ల పొడవు కలిగిన పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 1,29,259 హెక్టార్లకు నీరందింది. ఈ కాలువ ద్వారా కృష్ణాకు 80 టీఎంసీలు తరలించడం ద్వారా ఇందులో ఏపీకి 45 టీఎంసీలు, కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్టక్రు 14 టీఎంసీలు పంపిణీని విభజించాల్సి ఉంది. ఈ కాలువ ద్వారా కృష్ణా జిల్లాలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు సాధ్యమవుతోంది. అదేవిధంగా ఎడమ ప్రధాన కాలువ 213 కిలోమీటర్ల ద్వారా 23.44 టీఎంసీల మంచినీటి అవసరాలకు, విశాఖ పారిశ్రామిక, నగరం మంచినీటి అవసరాలకు వినియోగించనున్నారు. ఒక లక్షా 61వేల 875 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన తూర్పు, విశాఖ జిల్లాల్లో మెట్ట ప్రాంతంలోని కొత్త ఆయకట్టు సాగులోకి రానుంది. పోలవరం రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 194.6 టీఎంసీలైనప్పటికీ 322 టీఎంసీల నీటిని వినియోగించుకునే విధంగా డిజైన్ చేశారు. 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టిస్తున్నారు. 23.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ జరగనుంది. ఇంతటి ప్రయోజనం కలిగిన ఈ ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు జరగడం లేదు.