ఆంధ్రప్రదేశ్‌

తెలుగు భాషాభివృద్ధికి ప్రముఖుల కృషి అభినందనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజవిశాఖపట్నం (కల్చరల్), జనవరి 18: తెలుగు భాషాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణకు ప్రముఖులు విశేషంగా కృషి చేస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి అన్నారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ 16వ వార్షికోత్సవంలో భాగంగా విశాఖలోని వుడా బాలల ప్రాంగణంలో శనివారం రాత్రి నిర్వహించిన పురస్కార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తెలుగుభాష వర్ధిల్లుతుందన్నారు. వారానికి ఒక తెలుగు పద్యాన్ని అయినా పిల్లలకు నేర్పాలన్నారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతర కార్యక్రమాలు జరపడం అభినందనీయమన్నారు. గురజాడ, గిడుగు, శ్రీశ్రీ, కుమ్మరి మాస్టారు తదితరులు ఈ ప్రాంతంలో భాషాభివృద్ధికి విశిష్ట సేవలందించారన్నారు. కళలు, సాహిత్యం, స్నేహభావం మంచితనాన్ని పెంపొందిస్తాయని, తద్వారా ప్రపంచ శాంతి నెలకుంటుందన్నారు. ఈ సందర్భంగా ఎమెస్కో ప్రచురణకర్త ధూపాటి విజయకుమార్‌కు లోక్‌నాయక్ పురస్కారం, రెండు లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తూ దుశ్శాలవతో సత్కరించారు. విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్యకు జీవన సాఫల్య పురస్కారం, లక్ష నగదు అందజేస్తూ ఘనంగా సత్కరించారు.
'చిత్రం... విజ్ఞాన్ రత్తయ్యకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేస్తున్న దృశ్యం