ఆంధ్రప్రదేశ్‌

23 నుండి రాయలసీమ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, జనవరి 18: ఈనెల 23వ తేదీన హైదరాబాద్‌లోని రాయలసీమ ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసి, రాయలసీమ ఉద్యమాన్ని చేపడతామని టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి స్పష్టం చేశారు. శనివారం గుంటూరు జిల్లా నరసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు రాజధానుల ఏర్పాటును సీఎం జగన్మోహన్‌రెడ్డి విరమించుకోవాలని సూచించారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి మూర్ఖత్వం, అహంకారంతో నష్టపోతున్నాడని అన్నారు. సీఎం అయిన తర్వాత ఆయనను అహంకారం, మూర్ఖత్వం చెడగొట్టాయన్నారు. గతంలో రాష్ట్రం విడిపోయి, ఆంధ్రరాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మళ్ళీ ఇలా రాజధానిని మార్చడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. సెక్రటేరియట్ ఎక్కడ ఉంటుందో అక్కడే రాజధాని అభివృద్ధి చెందుతుందన్నారు. మూడు రాజధానుల ప్రకటన సరైందికాదన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ చదలవాడ అరవిందబాబు, సింహాద్రియాదవ్, కడియాల రమేష్, పులిమి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని పమిడిపాడు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.