ఆంధ్రప్రదేశ్‌

ఆరు జిల్లాల న్యాయవాదుల విధుల బహిష్కరణ కొనసాగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్), జనవరి 18: రాష్ట్ర హైకోర్టును అమరావతిలోని నేలపాడు నుండి తరలించరాదంటూ 40 రోజులకు పైగా నిరసనలు వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు, వాటిని ఫిబ్రవరి 3 వ తేదీ వరకు కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. శనివారం ఒంగోలులో జరిగిన న్యాయవాద జాయింట్ యాక్షన్ కమిటి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రతినిధులు పాల్గొన్న సమావేశానికి ఒంగోలు బార్ అధ్యక్షుడు బొడ్డు భాస్కర్‌రావు అధ్యక్షత వహించారు. సంపూర్ణమైన వనరులతో నేలపాడులో హైకోర్టు చక్కగా కొనసాగుతుందని, ఈ స్థితిలో తరలింపు ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోను నేలపాడులోనే హైకోర్టు కొనసాగాలని సమావేశం తీర్మానించింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి న్యాయవాదులు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం సమర్పించాలని, న్యాయపరమైన అంశాలతో తరలింపును ఆపేందుకు ప్రయత్నించాలని తీర్మానించింది. సమావేశంలో తొలుత అమరావతి ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు.