ఆంధ్రప్రదేశ్‌

ముగ్గులు వేసి మహిళల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 16: రాష్ట్ర రాజధానిగా అమరావతినే ఉండాలంటూ నగర మహిళలు ‘జై అమరావతి.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ ముగ్గులు వేసి తరలింపు యత్నాలపై తమ నిరసన తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో బెంజి సర్కిల్ సమీపంలోని వీ గ్రిల్ హోటల్ ప్రాంగణంలో సంక్రాంతి పండగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా గృహిణులు, యువత పెద్దసంఖ్యలో పాల్గొని ‘రాబందు లాంటి మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధానే ముద్దు, సేవ్ ఆంధ్రప్రదేశ్, మా ఆశ శ్వాస అమరావతి, చేయిచేయి కలుపుదాం .. భావితరాల కోసం అమరావతిని కాపాడుకుందాం, మన భవిష్యత్తు అమరావతి, జై అమరావతి - జైజై అమరావతి’ వంటి నినాదాలతో రంగురంగుల ముగ్గులు వేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. ఈసందర్భంగా జేఏసీ నాయకులు డాక్టర్ కార్తీక్, నాయకురాలు గద్దె అనూరాధ, సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా జేఏసీ నాయకులు, అనుబంధ సంఘాలు, సభ్యులు రాజధానిని కాపాడుకునే దిశగా ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు చేసుకోలేదని తెలిపారు. సంక్రాంతి రైతుల పండగ అని, పండగ పూట రైతులు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రైతులను కనీసం ఇప్పటివరకు పరామర్శించక పోవడం వారిపై ఆయనకున్న ప్రేమను తెలియజేస్తోందన్నారు. రాజధాని అమరావతికి మద్దతుగా మహిళలు ముగ్గురు వేసి ఉద్యమానికి మరింత స్ఫూర్తిని ఇచ్చారన్నారు. అనంతరం ముగ్గుల్లో ప్రతిభ కనపర్చిన మహిళలకు బహుమతులు అందజేశారు.
'చిత్రం... రాజధాని తరలింపు యత్నాలపై విజయవాడలో ముగ్గులు వేసి ప్రభుత్వానికి నిరసన తెలిపిన మహిళలు