ఆంధ్రప్రదేశ్‌

రైతులకు సీపీఐ నేతల సంఘీభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 16: రాష్ట్ర భవిష్యత్తు కోసం పస్తులు ఉండైనా రాజధాని అమరావతి ఇక్కడే కొనసాగేలా ఉద్యమాన్ని నడిపిస్తామని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు స్పష్టం చేశారు. ఆంధ్రులకు అత్యంత పెద్ద పండుగ సంక్రాంతి మూడు రోజులూ రాజధాని రైతులు తమ పోరును కొనసాగించారు. ఏపీకి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు, యువత, జేఏసీ ప్రతినిధులు చేస్తున్న ఆందోళనలు గురువారం 30వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో రైతులు, మహిళలు నిరాహార దీక్షలు కొనసాగించగా, కృష్ణాయపాలెం, నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం గ్రామాల్లో పండుగ రోజు సైతం మహాధర్నాలు కొనసాగాయి. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నేతృత్వంలోని బృందం రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు సంఘీభావం తెలిపారు. రాజధాని అమరావతిపై చేపట్టిన ఉద్యమం రోజురోజుకూ ఉద్ధృతవౌతున్న నేపథ్యంలో తల్లిదండ్రులకు సంఘీభావంగా నిరసనల్లో పాల్గొంటున్నారు. సేవ్ అమరావతి నినాదాలు చేస్తూ ఉద్యమంలో మేము సైతం అంటూ ముందుకు కదులుతున్నారు. బుధవారం ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఉపవాసాలు గురువారం కూడా కొనసాగాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్లలో పోస్టుకార్డుల ఉద్యమానికి గ్రామస్తులు శ్రీకారం చుట్టారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడుకు పోస్టుకార్డుల ద్వారా తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఎర్రబాలెంలో రైతులు, రైతుకూలీలు గ్రామస్తులు కాగడాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానుల ప్రకటన ఉపసంహరించుకునే వరకు నిరసన పర్వం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మూడు రాజధానుల అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి గెలిచిన తర్వాత తరలిస్తే తమకేమీ అభ్యంతరం లేదని నారాయణ స్పష్టం చేశారు.