ఆంధ్రప్రదేశ్‌

హుషారుగా జల్లికట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 16: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని ఎ.రంగంపేట, పుల్లయ్యగారిపల్లె, అరిగెలవారిపల్లిలో గురువారం పెద్దఎత్తున జల్లికట్టు జరిగింది. చిత్తూరు జిల్లా నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన యువకులు కూడా జల్లికట్టులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎ.రంగంపేటలో జరిగిన జల్లికట్టులో ప్రముఖ సినీనటుడు మంచు మోహన్‌బాబు తిలకించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పశువుల కొమ్ములకు కట్టిన పలకల కోసం యువత పోటీపడి, కోడె గిత్తలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే వేగంగా దూసుకువచ్చిన గిత్తలను పట్టుకునే ప్రయత్నంలో పలువురు యువకులు స్వల్పగాయాలకు గురయ్యారు. జల్లికట్టు నిర్వహించకూడదని పోలీసులు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసినా నిర్వాహకులు వాటిని పట్టించుకోలేదు. చివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.