ఆంధ్రప్రదేశ్‌

తిరుచానూరు అమ్మవారికి స్వర్ణ కల్యాణోత్సవం పీఠం బహూకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 16: తిరుచానూరు పద్మావతి అమ్మవారికి గురువారం చెన్నైకు చెందిన రవి సన్నారెడ్డి, బాలాజీ రామ్మూర్తి అనే భక్తులు 50 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు కల్యాణోత్సవ పీఠాన్ని తిరుచానూరు అమ్మవారికి బహూకరించారు. దాతలు ఈ బంగారు పీఠాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జేఈఓ బసంతకుమార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ ఝాన్సీరాణి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలు అమ్మవారిని దర్శించుకున్నారు. గజ మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం అధికారులు అమ్మవారి తీర్ధప్రసాదాలను అందజేశారు.

'చిత్రం... అమ్మవారికి బహూకరించిన కల్యాణోత్సవం స్వర్ణపీఠం