ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో అద్భుత ఫలితాలు సాధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: బీజేపీ, జనసేన కలిసి ముందుకు సాగనుండటం ఏపీ రాజకీయాల్లో చారిత్రక నిర్ణయమని భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రంలో ఇక అద్భుత ఫలితాలు సాధించబోతున్నామని చెప్పారు. విజయవాడలో గురువారం రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్న తరువాత బీజేపీ నాయకులు వేర్వేరుగా విలేఖరులతో మాట్లాడారు. ఇప్పటివరకు వైకాపా, టీడీపీ తమతో బీజేపీ దగ్గరగా ఉందని ప్రచారం చేసుకున్నాయని ఎద్దేవా చేశారు. తమకు నిన్నటివరకు ఏ పార్టీతోనూ సంబంధాలు లేవని, అయితే నేడు జనసేనతో కలిసి బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిని రాష్ట్రంలో ఏర్పాటు చేయదలచుకుందని ఆయన
వెల్లడించారు. రాష్ట్రంలో అద్భుత రాజకీయ ఫలితాలు సాధించి కుల రహిత, కక్ష సాధింపు లేని రాజకీయాలు నడుపుతామని చెప్పారు. మంచి వాతావరణంలో రెండు పార్టీల మధ్య చర్చలు జరిగాయని జీవీఎల్ వివరించారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దియోథర్ మాట్లాడుతూ తమ రెండు పార్టీలు కలిసి కుల, అవినీతి రాజకీయాలకు ఇక ముగింపు పలకాలని నిర్ణయించాయన్నారు. మకర సంక్రమణం సందర్భంగా ఏపీ రాజకీయాల్లో సరికొత్త మార్పులు తేబోతున్నామన్నారు. వైకాపా ప్రభుత్వం ఆరు మాసాల కాలంలోనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటంలో విఫలమైందని విమర్శించారు. టీడీపీతో ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని, అలాగే వైకాపాతోనూ తమకు ఎలాంటి పొత్తు ఉండదన్నారు. ఇక జనసేనతో బీజేపీది సైద్ధాంతిక సారూప్యతతో కూడిన పొత్తు మాత్రమేనని అన్నారు. కుటుంబ, కుల, అవినీతి రహిత రాజకీయాల కోసమే ఈ పొత్తు కుదిరిందన్నారు. ఏ ఒక్కరికీ అనుకూలంగా ఏ వర్గాన్ని ప్రోత్సహించేలా తమ కూటమి పనిచేయబోదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రోత్సాహంతో జరుగుతున్న మతమార్పిడుల అంశం కూడా తమ దృష్టికి వచ్చిందన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2024లో అధికారమే లక్ష్యంగా ఈ నాలుగున్నరేళ్లు రెండు పార్టీలు కలసి పనిచేయాలన్న నిర్ణయం జరిగిందని తెలిపారు. గతంలో టీడీపీ, నేడు వైకాపా రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తొక్కేశాయని కన్నా విమర్శించారు.