ఆంధ్రప్రదేశ్‌

పుణ్యభూమి నా దేశం.. నమో నమామీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 14: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని, ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడిన వారికి తెలియజేయాల్సిన అవసరం వుందని యూత్ సర్వీసెస్ విభాగం బృందం పేర్కొంది. 59వ నౌ ఇండియా ప్రోగ్రాం తరపున యూత్ సర్వీసెస్ శాఖ ఆధ్వర్యంలో విదేశీయుల పర్యటన మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రారంభమైంది. దశాబ్ధాలుగా విదేశాల్లో స్థిరపడిన భారతీయ సంతతి రెండు రోజుల పర్యటనలో భాగంగా 8 దేశాలకు చెందిన 40 మంది రాజమహేంద్రవరం విచ్చేశారు.
ఫిజీ, మయాన, మయాన్మార్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, సూర్యనామ్, మారీషాస్, ట్రిండాడ్ దేశాల నుంచి వచ్చిన వీరంతా మంగళవారం ధవళేశ్వరం బ్యారేజి, సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం పరిశీలించారు. జల వనరుల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాటన్ మహాశయుడు నిర్మించిన బ్యారేజి ప్రాధాన్యత, ప్రాముఖ్యత వారికి వివరించారు. నీటి సరఫరా విధానం తెలియజేశారు. ఫిజీ దేశం నుంచి వచ్చిన రాథిక ప్రతాప్ శర్మ ఈ సందర్భంగా స్పందిస్తూ తమ పూర్వీకులు భారతదేశంలో పుట్టడం తనకు ఎంతో గర్వంగా ఉందని, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ఉండటం తనకు ఎంతో తృప్తిగా ఉందన్నారు. తనకు ఇక్కడే ఉండిపోవాలనుందన్నారు. తమ పూర్వీకులు భారతదేశంలో పుట్టిన ప్రదేశం తనకు తెలియదన్నారు. స్టాలిన్ రాహుల్ శర్మ స్పందిస్తూ తాను న్యాయవాదినని, తనకు ఈ దేశం చాలా నచ్చిందన్నారు. వీలు చూసుకుని తన కుటుంబ సభ్యులతో భారతదేశం వస్తానన్నారు. సెట్రాజ్ సీఈవో రఘుబాబు మాట్లాడుతూ మన దేశ సంప్రదాయంపై మనవారికి తెలియజేయాల్సి వుందన్నారు. ఈ బృందానికి సమన్వయ అధికారిగా వినీత్‌కుమార్, యూత్ సర్వీసెస్ అధికారి రఘురామ్, మేనేజర్ మెహరాజ్, జిల్లా సెట్రాజ్ మేనేజర్ కాశీ విశ్వనాధ్ తదితరులు ఉన్నారు. రాజమహేంద్రవరం నగరంలో సంఘ సంస్కర్త, యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులు నివాసాన్ని, అనంతరం గోదావరి గట్టున వున్న రాళ్ళబండి సుబ్బారావు ప్రభుత్వ పురావస్తు ప్రదర్శన శాలను విదేశాల నుంచి వచ్చిన ఈ బృందం సందర్శించింది.
'చిత్రం... ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ సందర్శించిన భారతీయ సంతతి బృందం