ఆంధ్రప్రదేశ్‌

కార్మికుల హక్కులను హరిస్తే పతనం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 15: కార్మికుల హక్కులను హరిస్తే ఎంతటి ప్రభుత్వానికైనా పతనం తప్పదని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ హెచ్చరించారు. సీఐటియు రాష్ట్ర మహాసభలు నెల్లూరు నగరంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు నగరంలో నిర్వహించిన బహిరంగసభకు హాజరైన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానల వల్ల కార్మికులు అనేక కష్టాలు పడుతున్నారని, కార్మికుల హక్కులను హరిస్తే ఏ ప్రభుత్వానికైనా పతనం తప్పదని అన్నారు. ప్రతి సంస్థను ప్రైవేటీకరణ చేయడం కోసం కేంద్రం యోచిస్తోందని, ఏ ప్రభుత్వరంగ సంస్థను కూడా ప్రైవేటీకరణ చేసేందుకు ఒప్పుకోబోమని, కార్మికుల హక్కులు ముఖ్యమని స్పష్టం చేశారు. అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. హక్కుల సాధన కోసం ఐక్యపోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని, కార్మికులందరూ సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం చూస్తోందనీ, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని,కార్మికులకు అండగా పోరాటం చేస్తామని, అందులో వామపక్షాలే ముందుంటాయని స్పష్టం చేశారు. సీఐటియు రాష్ట్ర కార్యదర్శి గఫూర్ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వచ్చే జనవరి 3న జరిగే సార్వత్రిక సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలని కోరారు. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినా భాషలు, భావాలు ఒకటేనని, రాష్ట్రాల మధ్య భేషజాలం వద్దని, ఇద్దరూ ఒక తల్లీబిడ్డల వంటి వారేనని అన్నారు. ఈ కార్యక్రమలో ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, వై.శ్రీనివాసులురెడ్డి, సీపీఎం రాష్ట్ర నేతలు ధనలక్ష్మి, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...సీఐటియు రాష్ట్ర మహాసభల్లో అభివాదం చేస్తున్న త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, సీపీఎం, సీఐటియు నేతలు