ఆంధ్రప్రదేశ్‌

గాంధీకి అసలైన వారసుడు ప్రధాని మోదీయే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 15: జాతిపిత మహాత్మా గాంధీకి అసలైన వారసుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో ‘గాంధీజీ సంకల్ప యాత్ర’ నిర్వహించింది. రాష్ట్రంలోనూ నిర్వహించిన సంకల్ప యాత్రపై బీజేపీ పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకావిష్కరణ సభ నగరంలోని ఓ హోటల్‌లో ఆదివారం రాత్రి జరిగింది. ముఖ్యఅతిథిగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామస్వరాజ్య స్థాపనతోనే దేశం అభివృద్ధి సాధిస్తుందని మహాత్మా గాంధీ అనేవారని గుర్తుచేశారు. ఆయన కలను సాకారం చేయడం కోసం దేశ ప్రజల కళ్లల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా మోదీ పాలన సాగిస్తున్నారని కన్నా వివరించారు. రాష్ట్రంలో గాంధీజీ సంకల్ప యాత్ర కన్వీనర్‌గా వ్యవహరించిన నెహ్రూ యువకేంద్ర వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు, సంకల్పయాత్ర కోకన్వీనర్ తురగా నాగభూషణం ఈ కార్యక్రమం విజయవంతం చేశారని ఆయన కితాబిచ్చారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ జాతిపిత గాంధీజీ సిద్ధాంతాలను బీజేపీ ఆచరిస్తోందన్నారు. ఆయన మార్గం అందరికీ అనుసరణీయమన్నారు. రాష్ట్రంలో సీసీరోడ్లు, అంగన్‌వాడీ, పంచాయతీ కార్యాలయ భవనాల నిర్మాణం, శ్మశానాల అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగాయని చెప్పారు.
సభకు విష్ణువర్ధన్ రెడ్డి అధ్యక్షత వహించారు. రాష్ట్ర సహ ఇన్‌చార్జి సునీల్ దియోధర్, పార్టీ జాతీయ కార్యదర్శి కే సత్యకుమార్, మహిళా మోర్చా జాతీయ ఇన్‌చార్జి దగ్గుబాటి పురంధ్రీశ్వరి, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తురగా నాగభూషణం, నాయకులు అంబికా కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...గాంధీజీ సంకల్ప యాత్రపై పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కన్నా, జీవీఎల్ తదితరులు