ఆంధ్రప్రదేశ్‌

కాంట్ భావజాలం అనుసరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, డిసెంబర్ 14: ప్రఖ్యాత న్యాయ తత్వవేత్త ఇమ్మానుయేల్ కాంట్ జస్టిస్- రూపాంతర న్యాయం అనే అశంపై సబ్బవరంలోని దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో రెండురోజుల అంతర్జాతీయ సదస్సు శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఇక్కడి యూనివర్శిటీ సెమినార్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ సదస్సును ముఖ్య అతిథి లా-కమిషన్ మాజీ సభ్యుడు, ఆచార్య మూల్‌చంద్‌శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలిరోజు సదస్సులో డీఎస్‌ఎన్‌ఎల్‌యూ ఉపకులపతి ఆచార్య ఎస్.సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఇమ్మానుయేల్ కాంట్ భావనలకు నేటి సమకాలీన సమాజానికి ముఖ్యంగా న్యాయ వ్యవస్థ ప్రక్రియకు ఎంతో అవినావభావ సంబంధముందని అభిప్రాయపడ్డారు. అందుకోసమే ప్రఖ్యాత తత్వవేత్త ఇమ్మానుయేల్ తత్వం- రూపాంతర న్యాయం అనే అంశంపై తొలి సారిగా అంతర్జాతీయ స్థాయిలో న్యాయ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. భారత న్యాయ వ్యవస్థలో కాలానుగుణంగా అనేక ప్రయోగాలు, మార్పులను ఆయన గుర్తుచేశారు. దేశంలోని విభిన్న జాతులు, కులాలు,మతాలు, వర్గాల సమూహంగా ఉండటం వలన ఇలాంటి మార్పుల ఆవశ్యకత ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. దీంతో రాజ్యాంగ పరంగా న్యాయ వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు కూడా కాలానుగుణంగా అనేక నూతన ప్రక్రియలకు శ్రీకారం చుట్టడం ఎంతో అవసరంగా భావించాల్సి వస్తోందన్నారు. దేశంలోనే ఇమ్మానుయేల్ కాంట్ భావజాలంపై మొట్టమొదటి సారిగా ఇక్కడ నిర్వహిస్తున్న ఈ న్యాయ సదస్సుకు ఎంతో మంచి స్పందన రావటం ఆనందంగా ఉందని ఆచార్య సూర్యప్రకాష్ అన్నారు. ఈ సెమినార్‌కు వివిధ ప్రాంతాల న్యాయ విశ్వవిద్యాలయాల నుంచి అధిక సంఖ్యలో సభ్యులు హాజరయ్యారన్నారు. మరో వక్త ఆచార్య లక్ష్మీనాథ్ మాట్లాడుతూ ఇమ్మానుయేల్ కాంట్ భావజాలం నేటి సమాజానికి అనువర్తింప జేస్తూ మన చరిత్రలో అశోకుని కాలం నాటి న్యాయం, ధర్మసూత్రాలు, పొరపొచ్చాల ద్వారా ఇమ్మానుయేల్ కాంట్ ప్రభావం చూపించి ఉండవచ్చనే అభిప్రాయం వెలిబుచ్చారు. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం నుంచి హాజరైన ముఖేష్ శ్రీవాత్సవ, ఆచార్య తరుణ్‌మొహంతి కాంట్ భావజాలం, సామాజిక న్యాయంపై సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. డీఎస్‌ఎన్‌ఎల్‌యూ రిజిస్ట్రార్ సి.మాణిక్యాలరావు, ఆచార్య సీపీ దయానందమూర్తి, సెమినార్ డైరెక్టర్ డాక్టర్ సీపీ నందిని, బయోలాకిరణ్, శ్రీ సుధ, విశ్వచంద్రనాథ్, వివిధ ప్రాంతాల 50 మంది ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

*చిత్రం... డీఎస్‌ఎన్‌ఎల్‌యూ సెమినార్ హాల్‌లో సదస్సును ప్రారంభిస్తున్న ఆచార్య మూల్‌చంద్ శర్మ