ఆంధ్రప్రదేశ్‌

వైఎస్ జగన్ భరోసా మహిళల్లో ధైర్యం నింపింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), డిసెంబర్ 14: మహిళల రక్షణ, భద్రత కోసం ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఏపీ దిశ చట్టంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆరా తీస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రూపొందించిన దిశ చట్టం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలువనుందని శనివారం ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి తెలిపారు. చంద్రబాబు తాను అధికారంలో ఉన్న రోజుల్లో ఏనాడూ మహిళల భద్రత కోసం ఇటువంటి చట్టాలను తీసుకురాలేదన్నారు. మహిళలు, పసిపిల్లలపై ఘోరాలు జరిగితే బాబు ప్రచారం కోసం వాడుకున్నారన్నారు. ఏపీ సీఎం జగన్ ఇస్తున్న భరోసాతో మహిళల్లో ధైర్యం పెరుగుతోందన్నారు. ఈ దిశ చట్టం వల్ల నేరగాళ్లు 21 రోజుల్లో ఉరికంబం ఎక్కుతారని జగన్ ఇచ్చిన భరోసా మహిళల్లో ఆత్మస్థైర్యం నింపిందన్నారు.
*చిత్రం... వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి