ఆంధ్రప్రదేశ్‌

దిశ చట్టం రాజకీయ లబ్ధికోసమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, డిసెంబర్ 14: పుష్కర కాలం క్రితం జరిగిన తన కుమార్తె ఆయేషామీరా హత్య కేసును పట్టించుకోని ప్రభుత్వాలు, ప్రజాప్రతినిదులు ఇప్పడు కొత్తగా ‘దిశ’ చట్టాన్ని తీసుకురావడం కేవలం రాజకీయ లబ్ధికోసమేనని ఆమె తండ్రి ఇక్బాల్ బాషా ఆరోపించారు. 21రోజులలో నిందితులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని చెబుతున్న ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో ఆయేషా హత్యకేసు నిందితులను ఎందుకు పట్టుకోలేక పోయిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
ఆయేషామీరా కేసులో ఆధారాలను నాటి పోలీసులు ఎప్పుడో నిర్వీర్యం చేశారని, ఎన్ని చట్టాలు వచ్చినా ఆడపిల్లలకు మన రాష్ట్రంలో న్యాయం జరగదని ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం తెనాలిలోని ఈద్గావద్ద ఆయేషామీరా మృతదేహానికి సీబీఐ రీ పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం బాషా విలేఖరులతో మాట్లాడుతూ 12 సంవత్సరాల క్రితం ఓ సామాన్య విద్యార్థిని హత్యకు గురైనప్పటికీ ఇప్పటికీ నిందితులను పట్టించుకోలేని ప్రభుత్వాలు, పోలీసులు దిశ చట్టం చేయటం కంటితుడుపు చర్యల్లో భాగమేనని, ఇదంతా వారి రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శించారు. ప్రజాప్రతినిధులు రాజకీయాల కోసం చట్టాలు చేయటం కాదని, ప్రజల కోసం చేయాలని ఆయన హితవుపలికారు.
తాము నిందితులుగా ఆరోపిస్తున్న వ్యక్తులను పోలీసులు విచారించకుండానే సత్యంబాబు అనే అమాయకుడిపై నేరం మోపి కేసును పక్కదోవ పట్టించి ప్రజలకు పోలీసులపై ఉన్న నమ్మకాన్ని నాడే కాలరాశారని ఆవేదన వ్యక్తంచేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో నా కుమార్తె హత్య జరిగి మాకు అన్యాయం జరిగింది... కనీసం మీ హయాంలోనైనా మాకు న్యాయం చేయండని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఆయేషా మీరా తల్లి షంషాద్ బేగం విజ్ఞప్తిచేశారు. ఓ సామాన్యమైన యువతి హత్యకేసును 12సంవత్సరాల కాలంలో ప్రభుత్వాలు, పోలీసులు గుర్తించలేక పోయాయంటే కేసు వెనుక ఎంతటి పెద్దలున్నారో ప్రజలకు అర్థమవుతోందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.