ఆంధ్రప్రదేశ్‌

ఐఆర్‌ఎస్ గోపీనాథ్ డిప్యూటేషన్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 14: ఐఆర్‌ఎస్ అధికారి గోపీనాథ్ డిప్యూటేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు శనివారం సాధారణ పరిపాలనా విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర రెవెన్యూ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ విభాగంలో పనిచేస్తున్న ఆయన మూడేళ్ల కాలపరిమితితో 2015 జూలై 27న రాష్ట్రానికి డిప్యూటేషన్‌పై వచ్చారు. మూడేళ్ల వ్యవధి పూర్తయిన అనంతరం ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు ఆయన సర్వీస్‌ను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఈ మేరకు ఆయన 2020 జూలై 26 వరకు రాష్ట్రంలో పనిచేయాల్సి ఉంది. అయితే తన డిప్యూటేషన్ రద్దుచేయాలని ప్రభుత్వానికి ఆయన నివేదించారు. ఇందులో భాగంగా ఆయన్ను మాతృ సంస్థ అయిన సెంట్రల్ డైరెక్ట్ టాక్సెస్ విభాగానికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. టీడీపీ హయాంలో వైద్య, ఆరోగ్యశాఖలో ఆయన పనిచేశారు. గోపీనాథ్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆయనపై చర్యలు తీసుకోవాలని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అప్పట్లో ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రస్తుతం డిప్యూటేషన్ రద్దు కావటంతో తిరిగి కేంద్ర సర్వీస్‌లను కొనసాగించనున్నారు. గోపీనాథ్ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు కావటం గమనార్హం.