ఆంధ్రప్రదేశ్‌

18 నుంచి ‘అనంత’లో చంద్రబాబు పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 14: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఈనెల 18 నుండి మూడు రోజుల పాటు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మూడు రోజుల పర్యటన షెడ్యూల్‌ను పార్టీ వర్గాలు ఖరారు చేశాయి. 18వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3.30 వరకు జిల్లా తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొని సాయంత్రం 4 నుండి ఉరవకొండ, గుంతకల్లు, కదిరి, సింగనమల నియోజకవర్గాల సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. 19వ తేదీ ఉదయం విలేఖర్ల సమావేశం అనంతరం వైసీపీ దాడుల్లో నష్టపోయిన బాధితులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మడకశిర, రాయదుర్గం, పెనుకొండ, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాప్తాడు నియోజకవర్గాల సమీక్షా సమావేశాల్లో పాల్గొంటారు. 20వ తేదీన హిందూపురం, పుట్టపర్తి, ధర్మవరం, అనంతపురం నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో పాల్గొని మధ్యాహ్నం విజయవాడకు తిరుగు పయనం కానున్నారు.