ఆంధ్రప్రదేశ్‌

విశాఖ స్టీల్‌ప్లాంట్ భూములను పోస్కోకి ఇవ్వొద్దు: సీపీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 14: రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్ భూములు పోస్కో కంపెనీకి అప్పగించకుండా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని, ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు కోరారు. ఈ మేరకు శనివారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మధు బహిరంగ లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంటును పోస్కో కంపెనీకి కట్టబెట్టడంలో భాగంగానే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. పోస్కో కంపెనీ మన రాష్ట్రంలోని కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించేందుకు కావాల్సిన వనరులు అన్నీ ఉన్నాయన్నారు. కడపలో పోస్కో కంపెనీ స్టీల్ ప్లాంట్ నిర్మిస్తే రాష్ట్రంలోని మరో ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.