ఆంధ్రప్రదేశ్‌

21 రోజుల్లో నిందితుడికి శిక్ష విధించాలి: లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), డిసెంబర్ 14: ఏపీ అసెంబ్లీలో దిశ చట్టం ఆమోదించిన రోజునే గుంటూరులో బాలికపై అత్యాచారం జరగడం దారుణమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అనె్నం పునె్నం తెలియని ఐదేళ్ల బాలికపై మృగాడు లక్ష్మణ్‌రెడ్డి అత్యాచారానికి పాల్పడటం తనను ఎంతగానో కలిచివేసిందని శనివారం ట్విట్టర్‌లో లోకేష్ పేర్కొన్నారు. ఒక పక్క చట్టాలు పదునెక్కుతున్నా నిత్యం ఆగకుండా జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలిగించే అంశమన్నారు. మహిళలు బయటకు వెళ్ళాలంటే ఒకటికి రెండు సార్లు ఆరోచించి వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కొత్త ‘దిశ’ చట్టం ప్రకారం దురాగతానికి పాల్పడిన నిందితుడు లక్ష్మణ్‌రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ 21 రోజుల్లోనే శిక్ష పడేలా చేసి బాధిత కుంటుబానికి న్యాయం చేయ్యడంతో పాటు, మహిళలకు భరోసా ఇస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.