ఆంధ్రప్రదేశ్‌

చిన్నారులకు నైతికతపై బోధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: చిన్నారుల్లో నైతికతను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భావి భారత నిర్మాణంలో అటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్థులు గొప్ప భూమికను పోషిస్తున్నారన్నారు. ఉపాధ్యాయులు రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటి ఇతిహాసాలలోని నీతి, నైతికతలను విద్యార్థులకు బోధించాలని సూచించారు. శ్రీ పావని సేవా సమితి నేతృత్వంలో రూపుదిద్దుకున్న మహాభారతం, రామాయణం, భగవద్గీత పురాణ ఆధ్యాత్మిక పుస్తకాలను శనివారం రాజ్‌భవన్ దర్బార్ హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ జీవిత సారాన్ని మనకు నేర్పించే భగవద్గీతను మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల విశ్వవిద్యాలయాల్లో కూడా పాఠ్యాంశాల్లో చేర్చారన్నారు. మహాభారతంలో కర్ణుడి పాత్రపై అభిసప్తా కర్ణ అనే పేరుతో ఓడియాలో తాను ఒక పుస్తకం రాసానన్న హరిచందన్, శాంతి నికేతన్‌లో విభాగాధిపతిగా పని చేసిన తన సోదరుడు డాక్టర్ నీలాద్ భూషణ్ హరిచందన్ మహాభారత ఇతిహాసంపై అనేక పుస్తకాలు రాశారని గుర్తు చేశారు. రామాయం, మహాభారతం, భగవద్గీత, తదితర ఇతిహాస పుస్తకాలను తీసుకురావడంలో శ్రీ పావని సేవా సమితి చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో వీటిని రూపొందించారన్నారు. వీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఉపాధ్యాయులకు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. చల్లా సాంబిరెడ్డి, పావని సేవా సమితి బాధ్యులు ఆచార్య ముత్యాల నాయుడు, వివిధ ఆధ్యాత్మిక సంస్థల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

*చిత్రం... ఆధ్యాత్మిక గ్రంథాలను ఆవిష్కరిస్తున్న గవర్నర్ విశ్వభూషణ్ తదితరులు